Polavaram Project(Photo-wikimedia commons)

Amaravati, Sep 22: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ వస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని (revise the estimated cost of Polavaram) కేంద్రం సవరించింది. 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు సవరించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ( Gajendrasingh Shekhawat) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సోమవారం ఆయన సంతకం చేసి కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ), కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ(REC) ఇప్పటికే అంచనా వ్యయాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఫైలుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సంతకం చేయడంమే మిగిలి ఉంది.

ఇప్పటికే జగన్ సర్కారు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.838 కోట్లను ఆదా చేసిన విషయం విదితమే. ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆమోదించిన సవరించిన అంచనాల ప్రకారం పోలవరం హెడ్‌వర్క్స్‌ వ్యయం రూ.9,734.34 కోట్లు. కుడి కాలువ వ్యయం రూ.2,865.75 కోట్లు, ఎడమ కాలువ వ్యయం రూ.2,720.8 కోట్లు, భూసేకరణ, సహాయ పునరావాస(ఆర్‌ఆర్‌) ప్యాకేజీ వ్యయం రూ.28,172.21 కోట్లు, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వ్యయం రూ.108 కోట్లుగా ఉంది.

జగన్ సర్కార్ కొత్త రికార్డ్, పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా, తక్కువ మొత్తానికి దక్కించుకున్న మేఘా కంపెనీ, టీడీపీ విమర్శల దాడి

2010–11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ వ్యయం పెరగడం.. నిర్వాసితులకు పునరావాసంకోసం ఆర్‌ అండ్‌ ఆర్‌ వ్యయం పెరగడంతో 2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు చేరుకుంది. కేంద్రం నుంచి ఇంకా రావాల్సింది రూ.29,521.70 కోట్లు అని తెలుస్తోంది.

పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం ఎపి ప్రభుత్వం ఖర్చు చేసిన రూ .4 వేల కోట్లకు పెండింగ్‌లో ఉన్న నిధులను తిరిగి చెల్లిస్తామని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ హామీ ఇచ్చారు. జల వనరుల మంత్రి పి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నుండి వైయస్ఆర్సి ఎంపీలు మరియు అధికారుల ప్రతినిధి బృందం అనిల్ కుమార్ యాదవ్, న్యూ ఢిల్లీలో కేంద్ర మంత్రిని సోమవారం కలిశారు. పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని కోరుతూ వారు షెకావత్‌కు ఒక మెమోరాండం సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిని ఆయనకు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని చూడటానికి ఆయనను ఎపికి ఆహ్వానించారు.

పోలవరం పనులు తిరిగి ప్రారంభం, భూమి పూజ చేసిన మేఘా సంస్థ ప్రతినిధులు, 2021 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న ఏపీ సీఎం జగన్, తగ్గిన గోదావరి నీటి మట్టం

ఒకటి లేదా రెండు రోజుల్లో ఫైల్‌ను క్లియర్ చేసి, పెండింగ్‌లో ఉన్న నిధులను రాష్ట్రానికి విడుదల చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తామని షెకావవత్ హామీ ఇచ్చారు. షెకావత్ కు కరోనా సోకడంతో ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో ఫైల్ క్లియరెన్స్ ఆలస్యం అయింది. కృష్ణ నదిపై ఎపి చేపట్టిన ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రికి సమాచారం ఇచ్చామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై సుప్రీం కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి తేదీని నిర్ణయించాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్..వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వాదనలను సమర్థవంతంగా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జల వనరులు) ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,300 కోట్లను రీయింబర్స్‌మెంట్‌ చేసేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సోమవారం ఆయన సంబంధిత ఫైలుపై సంతకం చేసి ఆర్థిక శాఖకు పంపారు. బహిరంగ మార్కెట్లో బాండ్లద్వారా రుణాలను సేకరించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించనుంది. వారంలోగా రూ.2,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.