TS Dasara Holiday: తెలంగాణలో ఆరోజే దసరా! సెలవును మార్చిన ప్రభుత్వం, గతంలో ఇచ్చిన సెలవును కూడా కొనసాగిస్తూ ఉత్తర్వులు
ఈ నెల 23వ తేదీన దసరా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 24న సైతం సెలవును ఇచ్చింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్ సభ ఈ నెల 23న దసరా పండుగను (Dasara Holiday) నిర్వహించుకోవాలని సూచించింది.
Hyderabad, OCT 07: దసరా సెలవును (Dasara Holiday) ప్రభుత్వం మార్పు చేసింది. ఈ నెల 23వ తేదీన దసరా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 24న సైతం సెలవును ఇచ్చింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్ సభ ఈ నెల 23న దసరా పండుగను (Dasara Holiday) నిర్వహించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విజయ దశమి సెలవును మార్చింది. ఇంతకు ప్రకటించిన సెలవును సైతం కొనసాగింది. ఇదిలా ఉండగా.. పాఠశాల విద్యార్థులకు సెలవులతో పాటు, మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు (Dasara Holidays) ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. బతుకమ్మ ప్రారంభ రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా.. దుర్గాష్టమి అక్టోబర్ 22న ఐచ్ఛిక సెలవు ఇచ్చింది.
పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు పాటు సెలవులు ఇవ్వగా.. జూనియర్ కళాశాలలకు కళాశాలలకు ఏడు రోజులు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు కొనసాగనుండగా.. 26న తెరచుకోనున్నాయి. జూనియర్ కాలేజీలకు దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.