Animals on Solar Roof Cycle Track (PIC@ X)

Hyderabad, OCT 07: హైదరాబాద్ కోకాపేటలో ఇటీవల ప్రారంభించిన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను (Solar Roof Cycle Track) ఇప్పుడు జంతువులు ఉపయోగించుకుంటున్నాయంటూ రెడిట్‌లో r/hyderabad యూజర్ వీడియో పోస్ట్ చేశారు. ట్విటర్‌లోనూ ఇదే వీడియోను ఇండియన్ టెక్ & ఇన్‌ఫ్రా పేరుతో ఉన్న ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. మనుషులు సైకిల్ తొక్కుకోవడం కోసం వేసిన ట్రాక్‌ బర్రెలకు (Solar Roof Cycle Track) ఉపయోగపడడం ఏంటంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఫొటోలు దిగడం కోసమే ఈ సైకిల్ ట్రాక్‌ను వేసినట్లుందని అంటున్నారు. అంత ఖర్చు చేసి సైకిల్ ట్రాక్ నిర్మించి ఇలా పశువుల పాలు చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

 

కాగా, హైదరాబాద్‌ ఔటర్ రింగ్‌ రోడ్డు సర్వీస్ రోడ్లపై ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ లను గత ఆదివారం కేటీఆర్ ప్రారంబించారు. మొత్తం 23 కిలో మీటర్ల మేర సైకిల్‌ ట్రాక్‌ ఉంది. నానక్ రామ్ గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ 8.5 కిలోమీటర్లు, అలాగే, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్లు సైకిల్ ట్రాక్ నిర్మించారు.