Women MLAs in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన 8 మంది మ‌హిళ‌లు, ఈ సారి రికార్డు సృష్టించిన యువతులు, అతిపిన్న వ‌య‌స్సులో అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న ఎమ్మెల్యేలు వీళ్లే!

కొత్తగా విజయం సాధించినవారిలో కంటోన్మెంట్‌ నుంచి లాస్య నందిత, పాలకుర్తిలో మామిడాల యశస్విని , నారాయణ్‌పేట్‌లో పర్నికా రెడ్డి (Parnika Reddy) ఉండగా, ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, నర్సాపూర్‌లో సునితా లక్ష్మారెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, వరంగల్‌ తూర్పులో కొండా సురేఖ(Konda surekha), ములుగులో సీతక్క, కోదాడలో పద్మావతి రెడ్డి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

Women MLAs in Telangana Assembly (PIC@ X)

Hyderabad, December 03: తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల (Women MLA's) సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో ముగ్గురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం. కొత్తగా విజయం సాధించినవారిలో కంటోన్మెంట్‌ నుంచి లాస్య నందిత, పాలకుర్తిలో మామిడాల యశస్విని (Yashaswini Reddy), నారాయణ్‌పేట్‌లో పర్నికా రెడ్డి  (Parnika Reddy) ఉండగా, ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, నర్సాపూర్‌లో సునితా లక్ష్మారెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, వరంగల్‌ తూర్పులో కొండా సురేఖ(Konda surekha), ములుగులో సీతక్క, కోదాడలో పద్మావతి రెడ్డి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు

RGV on Revanth Reddy & KTR: రేవంత్ రెడ్డి, కేటీఆర్ పై ఆర్జీవీ సెన్సేష‌న‌ల్ పోస్ట్, ఇంత‌వ‌ర‌కు ఇలాంటి నాయ‌కుల‌ను చూడ‌లేదంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రామ్ గోపాల్ వ‌ర్మ‌ 

గత ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి, గొంగిడి సునిత, హరిప్రియా నాయక్‌, రేఖా నాయక్‌, సీతక్క, పద్మా దేవేందర్‌ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏడుగురు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది. వారిలో లాస్య నందిత, కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి మాత్రమే విజయం సాధించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif