Hyderabad, December 03: సినిమా టు పాలిటిక్స్ ఏదొక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేసే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా బిఆర్‌ఎస్ లీడర్ కేటీఆర్ పై ప్రశంస చేస్తూ ట్వీట్ చేశారు. నేడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ డే అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పరాజయం పాలవ్వడంతో కేటీఆర్ (KTR) ఒక ట్వీట్ చేశారు. ‘నిన్న కేటీఆర్ తన ట్విట్టర్ లో గన్ పట్టుకున్న ఓ ఫోటో షేర్ చేస్తూ హ్యాట్రిక్ విజయం ఖాయం. సెలబ్రేషన్స్ కి సిద్దంకండి’ అంటూ ట్వీట్ చేశారు. నేడు ఆ ట్వీట్ ని తానే రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ఇలా రాసుకొచ్చారు.. “విజయం పై నేను చేసిన మాటలకు అంతం లేదు. కేవలం ఈసారి మిస్ అయ్యింది అంతే” అంటూ ఓటమని కూడా స్పోర్టివ్ గా తీసుకుంటూ ట్వీట్ చేశారు.
In fact this will age very well sir ! That’s because I never saw any political leader taking his defeat in such a positive spirit ..KUDOS TO YOU💐💐💐 This is what’s needed for a HEALTHY DEMOCRACY 🙏🙏🙏 https://t.co/Fp00Y8MfKl
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023
ఇక ఈ ట్వీట్ కి ఆర్జీవీ రెస్పాండ్ అవుతూ.. “ఇప్పుడు ఈ ఓటమి మీద మీరు చేసిన మాటలకు కూడా అంతం లేదు సర్. ఎందుకంటే ఓటమిని ఇంత పాజిటివ్ గా తీసుకున్న ఏ పొలిటికల్ లీడర్ ని నేను చూడలేదు. ఆ విషయంలో మీకు హ్యాట్సాఫ్. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమే అందరికి కావాల్సింది” అంటూ ట్వీట్ చేశారు. ఆర్జీవీతో పాటు కేటీఆర్ ట్వీట్ పై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి
SUPER DUPER proud to know the present HONOURABLE CHIEF MINISTER of TELANGANA the WARRIOR KING REVANTH REDDY ..Hey @revanth_anumula Take 10000000000000000000000 BOWS🙏 pic.twitter.com/bQDVFdUjSP
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023
కాగా రామ్ గోపాల్ వర్మ, రేవంత్ రెడ్డి (Revanth Reddy)గురించి కూడా ట్వీట్ చేశారు. “కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో పరాజయాన్ని ఎదుర్కొంది. తెలంగాణ విజయం చూస్తుంది. అయితే ఈ విజయం కాంగ్రెస్‌ది కాదు రేవంత్ రెడ్డిది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీరు మీ బాహుబలి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయాలి” అంటూ ట్వీట్ చేశారు. అలాగే జీవితంలో మొదటిసారి రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ పై గౌరవం కలుగుతుందని చెప్పుకొచ్చారు. గౌరవిలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తే చాలా గర్వంగా ఉందంటూ పేర్కొన్నారు.