Polling Time In Telangana: తెలంగాణలో పోలింగ్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఎన్నిక‌ల సంఘం, అన్ని పార్టీల విజ్ఞ‌ప్తి మేర‌కు పోలింగ్ స‌మ‌యం పెంపు

పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (Polling) ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

Polling (Credits: X)

Hyderabad, May 01: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని (Polling Time) పొడిగించింది ఎన్నికల సంఘం. పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (Polling) ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. సమస్యాత్మక, ఏజెన్సీ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని స్పష్టం చేసింది.

KCR Barred by EC: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నిక‌ల సంఘం బిగ్ షాక్, 48 గంట‌ల పాటూ ప్ర‌చారం చేయొద్దంటూ నిషేదం, ఇంత‌కీ ఎందుకు బ్యాన్ విధించారంటే? 

మే 13న లోక్ సభ స్థానాలకు తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ కు సమయం ఇచ్చింది. తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు.