Etela Rajender Road Show: ప్రగతి భవన్ నుంచి వచ్చే స్క్రిప్ట్‌ చదివే వారి చరిత్రేంటో ప్రజలకు తెలుసు, హుజూరాబాద్ నుంచే తెలంగాణ ఆత్మగౌరవ బావుటా జెండా ఎగరవేస్తాం, ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి హుజూరాబాద్‌లో రోడ్ షో నిర్వహించిన ఈటెల రాజేందర్

ఎత్తిన జెండా, బిగించిన పిడికిలితో ముందుకు సాగుతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. కమలాపూర్‌ (kamalapur) మండలంలో అభిమానులు, కార్యకర్తలతో కలిసి రోడ్‌షోలో (Etela Rajender Road Show) పాల్గొన్నారు.

Etela Rajender Road Show (Photo-Video Grab)

Huzurabad, June 8: తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ కేంద్రబిందువని.. ఎత్తిన జెండా, బిగించిన పిడికిలితో ముందుకు సాగుతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. కమలాపూర్‌ (kamalapur) మండలంలో అభిమానులు, కార్యకర్తలతో కలిసి రోడ్‌షోలో (Etela Rajender Road Show) పాల్గొన్నారు.

శంభునిపల్లి, కానెపర్తి గ్రామాల మీదుగా రోడ్‌షో కొనసాగింది. ఈటల మద్దతుదారులు, అభిమానులు, యువకులు ‘జై-ఈటల’ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు మంగళహారతులతో ఈటలకు ఘన స్వాగతం పలికారు. కమలాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈట‌ల ప‌ర్య‌ట‌న దృష్ట్యా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహ‌రించారు. అనంతరం కమలాపురంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఈటల (Former Minister etela rajender) మాట్లాడారు.

Here's Eatala Rajender Tweet

ఆనాడు సింహగర్జనకు కరీంనగర్‌ ఎలా తొలిపలుకు పలికిందో.. నేడు హుజూరాబాద్‌ కూడా ఆత్మగౌరవ పోరాటానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమక్షేత్రంగా మారనుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధిచెబుతామని హుజూరాబాద్‌ నియోజకవర్గ (Huzurabad Constituency) ప్రజలు చెప్పారని.. ఎన్నికల్లో తన విజయానికి భరోసా ఇచ్చారని తెలిపారు.

సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసు ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పోలీసులు వేధిస్తున్నారని.. సీపీ సజ్జనార్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపిన బాధితుడు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ధర్మానికి, అధర్మానికి మధ్య సంగ్రామం జరగనుందన్నారు. కొంతమంది వ్యక్తులు తొత్తులుగా మారి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధి చెబుతామన్నారు. హుజూరాబాద్‌ నుంచే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని ఈటల చెప్పారు. నియోజకవర్గంలో ధర్మానిదే విజయమని.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా హుజూరాబాద్ నుంచే ఎగురవేస్తామన్నారు. అక్రమ సంపాదనతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే..ఆయన తండ్రి కంటే ఎక్కువని తెలిపిన మంత్రి తన్నీరు హరీష్ రావు, ఈటలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన తెలంగాణ ఆర్థికమంత్రి

అబద్ధాలకోరులు తమని అడ్డుకోలేరని తెలంగాణ ఆత్మగౌరవానికి హుజూరాబాద్‌ ప్రజలు ఊపిరిపోయాలన్నారు. ప్రగతిభవన్‌ నుంచి వచ్చే స్క్రిప్ట్‌ను చదవడమే కొందరి పని అని ఆరోపించారు. వారిపై తాను మాట్లాడనని.. వారి చరిత్రేంటో ప్రజలకు తెలుసు అన్నారు. తన గురించి మాట్లాడేవారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని, 19ఏళ్లు తెలంగాణ ఉద్యమం కోసం పని చేశానని చెప్పారు. త్వరలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.

 'పొట్టొని నెత్తిని పొడుగోడు కొడితే, పొడుగోని నెత్తిని పోచమ్మ కొడుతుందట' సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేంధర్ విమర్శల బాణాలు, టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా!

నియోజకవర్గ ప్రజా ప్రతినిధులను డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు. హక్కుల కోసం, నిరుద్యోగులకు కోసం పోరాటం చేస్తానని, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఎన్నిక జరగబోతుందని తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు చైతన్య వంతమైన ప్రజలని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. కాగా ఈటెల ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి హుజూరాబాద్‌ వెళ్లడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.