Harish Rao on Etela Comments: నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే..ఆయన తండ్రి కంటే ఎక్కువని తెలిపిన మంత్రి తన్నీరు హరీష్ రావు, ఈటలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన తెలంగాణ ఆర్థికమంత్రి
Harish Rao tested positve for Corona (photo-PTI)

Hyderabad, june 5: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు (Telangana Finance Minister Harish Rao) స్పందించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యల్ని (Etela rajender comments,) తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈటల పార్టీని వీడటానికి అనేక కారణాలు ఉండొచ్చని, పార్టీలో ఉండాలా.. పోవాలా అన్నది ఆయన ఇష్టమన్నారు. తన భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకోవడం విఫలప్రయత్నమన్నారు.

ఈటల పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకిచ్చింది ఎక్కువని పేర్కొన్నారు. కేసీఆర్‌ తనకు మార్గదర్శి అని, తండ్రి కంటే ఎక్కువ అన్నారు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌లోనే ఉంటానన్నారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు ఈటల వైఖరి ఉందని విమర్శించారు. ఈటల పార్టీని వీడినా టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదన్నారు. తనకు పార్టీ ప్రయోజనాలే పరమావధి అని, నాయకత్వం ఏ పని అప్పగించినా పూర్తి చేయడం తన విధి అన్నారు. ‘‘తన గొడవలకు నైతిక బలం కోసం పదేపదే నా పేరు ప్రస్తావించడం.. ఈటల భావదారిద్య్రానికి నిదర్శనం’’ అంటూ హరీశ్(Harish Rao Thanneeru) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కరోనా మూడో వేవ్‌కు సన్నద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం సౌకర్యాలు పెంచుతామని తెలిపిన సోమేష్‌కుమార్, రాష్ట్రంలో తాజాగా 2,070 మందికి కోవిడ్, 18 మంది మృతితో 3,364కి పెరిగిన మరణాల సంఖ్య

కాగా, టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ఈటల రాజేందర్‌ నిన్న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ కేసీఆర్‌తో నాకు ఐదేళ్ల క్రితం నుంచే అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. పార్టీలో హరీష్‌రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. నన్ను బొంద పెట్టమని అందిన ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌ నా మీద పనిచేస్తుండవచ్చు. కానీ, ఆయన దుఃఖపడే సమయమొస్తే మిత్ర బృందం ఎవరూ అండగా ఉండరు. జిల్లాకు సంబంధించిన సమస్యపై ప్రగతిభవన్‌కు వెళ్తే అనుమతి లేదని ఆపేశారు.

ఇదే తరహాలో మూడు పర్యాయాలు అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. మంత్రి పదవి పెద్దదే అయినా ఆత్మగౌరవం, బాధ్యతలు లేని బానిస పదవి మాకు వద్దని ఎంపీ సంతోష్‌కు చెప్పా. ప్రగతిభవన్‌ కాదు.. బానిసల నిలయం అని పేరు పెట్టుకోవాలని చెప్పాం. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు సీఎం కార్యాలయంలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌ అధికారి లేడు. మంత్రులు లేకుండానే సమీక్షలు జరిగిపోతాయి’’ అని అన్నారు.