Manikrao Challenges to BRS: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తా, సవాల్ విసిరిన తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. మహారాష్ట్రలో కేసీఆర్ టూర్‌తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.

Manikrao Thakre (Photo-Twitter)

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే సవాల్‌ విసిరారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. మహారాష్ట్రలో కేసీఆర్ టూర్‌తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.

సోమవారం ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు కేసీఆర్ బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాణిక్‌రావు ఠాక్రే స్పందిస్తూ.. బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌గా మారిందని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరబోయే 35 మంది లిస్ట్ ఇదిగో, జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుదే

తెలంగాణలో దోచుకున్న సొమ్మును మహారాష్ట్రలో కేసీఆర్ ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.



సంబంధిత వార్తలు

Farmers Protest: కనీస మద్దతు ధరపై రైతుల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కిసాన్ నాయకుడికి తక్షణ వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య