Diwali Victims: దీపావళి పండుగ నాడు అపశ్రుతులు.. హైదరాబాద్ లోని సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు

యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు బాణసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

Firecrackers (Photo Credits: IANS)

Hyderabad, Nov 1: తెలంగాణలో (Telangana) దీపావళి సంబురాలు (Diwali Celebrations) అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు బాణసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల కంటికి గాయాలైన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో బాధితులు హైదరాబాద్‌ మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి దవాఖాన (Sarojini Devi Eye Hospital) వద్ద బారులు తీరారు. ఇప్పటివరకు 50 మంది గాయాలతో హాస్పిటల్‌కు వచ్చారు. వారిలో 34 మందికి స్వల్పంగా గాయాలవగా, మరో 9 మందికి సీరియస్‌ గా ఉందని వైద్యులు వెల్లడించారు.

బ్లేడ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి.. మహిళలకూ గాయాలు.. ఏపీ తాడేపల్లిలో ఘటన (వీడియో)

గతేడాదితో పోలిస్తే తక్కువ

గాయపడిన వారిలో 35 మంది చిన్నారులు ఉన్నారని వైద్యులు తెలిపారు. వారందరికి చికిత్సం అందిస్తున్నట్లు చెప్పారు. గతేడాదితో పోల్చితే ఈసారి క్షతగాత్రుల సంఖ్య తగ్గిందన్నారు.

గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలు.. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘటన (వీడియో)