Fire at Ganesh Pandal: హైదరాబాద్ దిల్‌ సుఖ్‌ నగర్ లోని గణేష్ మండపం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియోతో)

ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు.

Fire at Ganesh Pandal (Credits: X)

Hyderabad, Sep 8: హైదరాబాద్ (Hyderabad)లోని దిల్‌ సుఖ్‌ నగర్ పీఎన్టీ కాలనీలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి కూడా అదే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకొన్నారు. అందరికంటే వినూత్నంగా ఉండాలని కొత్తగా పత్తి (Cotton)తో డెకరేషన్ చేశారు. అంతా పూర్తయింది అనుకునే లోపు మెయిన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ అయి విద్యుత్ ఘాతుకానికి (Fire Accident) కాలి బూడిద అయిపోయింది.

హైదరాబాద్‌ లో ఉండి కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రుచి చూడొచ్చు.. ఇకపై నగరంలో ప్రతి రోజూ లడ్డూ ప్రసాదం విక్రయాలు.. కీలక ప్రకటన చేసిన టీటీడీ

Here's Video and Photos:

తృటిలో తప్పిన పెనుముప్పు

అగ్నిప్రమాద ఘటనకు ఐదు నిమిషాల ముందు మండపం వద్ద చిన్నారులు సందడి చేసి అప్పుడే తమ ఇండ్లళ్లకు వెళ్ళారు. అలా వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది. దీంతో మండపం వద్ద చిన్నారులంతా కన్నీరుమున్నీరయ్యారు. అయితే, దైవానుగ్రహం ఉండడం వల్ల ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కాలేదని స్థానికులు చెబుతున్నారు.

వెదురు బొంగుతో వినాయకుడు, తయారు చేసిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif