Hyderabad, Sep 8: ఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం (Tirumala Srivari Laddu) రుచికి సాటి మరొకటి రాదు. తిరుపతికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ లడ్డును (Srivari Laddu) కచ్చితంగా తీసుకోకుండా ఉండలేరు. అయితే, తమ ఊళ్ళల్లో కూడా ప్రతి రోజూ ఈ లడ్డు అందుబాటులో ఉంటే బావుంటుందని హైదరాబాద్ వాసులు అనుకోని రోజులేదు. అలాంటి హైదరాబాదీ భక్తులకు ఓ పెద్ద గుడ్ న్యూస్. శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం ఇకపై ప్రతి రోజూ నగరంలో అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఎక్కడ దొరుకుతుంది??
నగరంలోని హిమాయత్ నగర్ లిబర్టీ, జూబ్లి హిల్స్ లోని టీటీడీ దేవస్థానాల్లో ప్రతి రోజూ ఈ శ్రీనివాసుడి లడ్డూను విక్రయించనున్నారు. రూ.50కి ఒక లడ్డూ చొప్పున భక్తులకు ప్రసాదం విక్రయించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆలయాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతాయని నిర్వాహకులు వివరించారు.
పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో