Fire Accident In Software Company: హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు (వీడియో)
ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఈ ఘటన జరిగింది.
Hyderabad, Dec 21: హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్ లో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఈ ఘటన జరిగింది. తొలుత ఒక ఫ్లోర్ లో మొదలైన మంటలు క్రమంగా బిల్డింగ్ లో ఉన్న ఐదంతస్తులకు వ్యాపించాయి.దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా మంటలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
కేటీఆర్ పై మరో కేసు నమోదు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ
Here's Video:
ఉద్యోగులు బయటకు
బిల్డింగ్ లో మంటలు వ్యాపించడంతో నైట్ షిఫ్ట్ చేస్తున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఏం జరిగిందో అర్థం కాలేదని, పొగ చూరి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిందని ఓ ఉద్యోగి పేర్కొన్నారు.