Bharat Gaurav Rail: సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ‘భారత్ గౌరవ్’ రైలు.. రైలును జెండా ఊపి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్.. 8 రాత్రుళ్లు, 9 పగళ్లు పూరి, కోణార్క్, గయ, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను చుట్టనున్న రైలు
దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఉద్దేశించిన ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు.
Hyderabad, March 19: దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఉద్దేశించిన ‘భారత్ గౌరవ్’ రైలు (Bharat Gaurav Rail) సికింద్రాబాద్ (Secunderabad) నుంచి బయలుదేరింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 26 వరకు అంటే 8 రాత్రులు, 9 పగళ్లు సాగుతుంది. యాత్రలో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యకేత్రాల సందర్శన ఉంటుంది.
ఆహారం ఏంటి?
తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలో ఆగుతుంది. ఇందులోని ప్రయాణికులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. ఈ రైలులో ప్రయాణించే యాత్రికులకు కూచిపూడి నృత్యంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.