Road Accident in Hanamkonda: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొట్టిన టిప్పర్.. నలుగురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మహిళలు.. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన
ఆత్మకూరు, కటాక్షాపూర్ మధ్య ఓ కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
Hanamkonda, June 26: హన్మకొండ (Hanamkonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆత్మకూరు (Atmakooru), కటాక్షాపూర్ (Katakshapur) మధ్య ఓ కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వారంతా ఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు (Female) ఉన్నారు. కారులో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్... కారును బలంగా ఢీకొట్టింది. దాంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవర్, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరణించినవారు వరంగల్ కాశీబుగ్గ సొసైటీకి చెందినవారిగా గుర్తించారు.
వేగమే కారణం
ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలు వేగంగా రావడం, టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.