Representational Picture

నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దాంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్నాయి. ఈ క్రమంలో రాగల రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం IMD హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల రెండు మూడు రోజుల్లో అతివృష్టి కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన ఉంది.