Karimnagar Road Accident: వయసు 16.. అయినా 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి నలుగురి మృతికి కారకుడయ్యాడు, కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి
వేగంగా దూసుకొచ్చిన కారు కమాన్ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న గుడిసెల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి (Karimnagar Road Accident) చెందారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
karimnagar, Jan 31: కరీంనగర్ పట్టణణంలో కారు ఆదివారం ఉదయం బీభత్సం సృష్టించిన సంగతి విదితమే. వేగంగా దూసుకొచ్చిన కారు కమాన్ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న గుడిసెల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి (Karimnagar Road Accident) చెందారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని కరీంనగర్ సిపి సత్యనారాయణ వెల్లడించారు. కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ మైనర్ల నిర్వకమేనని తేల్చారు. కారు యాక్సిడెంట్ చేసింది 16 సంవత్సరాల మైనర్ అని పేర్కొన్నారు. మైనర్లు కారు డ్రైవింగ్ చేయడంతో నలుగురు యువతుల మృతికి కారణమయ్యారు. యాక్సిడెంట్ సమయంలో కారులో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. కారును మైనర్లకు ఇచ్చిన రాజేంద్రప్రసాద్‌ను అరెస్ట్ చేశామని సిపి తెలిపారు.
ఈ వాహనంపై (టీఎస్ 02 ఈవై 2121) గతంలో కూడా అతివేగంగా వెళ్లిన కారణంగా తొమ్మిది చలాన్లుండటం గమనార్హం. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న ఏడుగురిని కారు ఢీకొంటూ విద్యుత్తు స్తంభానికి తగిలి ఆగిపోయింది. సంఘటనా స్థలిలో కారుకు, విద్యుత్తు స్తంభానికి మధ్యన ఇరుక్కుని పవార్ పరియాగ్ అలియాస్ స్వప్న(32) అనే మహిళ మృతిచెందగా ఆసుపత్రిలో చికిత్స అందించే లోపలే పవార్ లలిత(27), పవార్ సునీత(30), సోలారి జ్యోతి(14) చనిపోయారు.
కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, పాదాచారులను ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు, ఆరుమంది అక్కడికక్కడే మృతి
పవార్ అనూష, సోలారి రాణి, ఆరేళ్ల సోలారి అవంతికలు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా దగ్గరి బంధువులే. కొలిమిలో పారలు, గడ్డపారలు, కొడవళ్లకు పదును పెడుతూ జీవనం ( labourers in Karimnagar ) సాగించేవాళ్లు. ఆదివారం కావడంతో మాంసాన్ని కొనుగోలు చేసిన వారిలో కొందరు వీరి వద్దకు మేక తల, కాళ్లను తీసుకొచ్చి కొలిమిలో కాల్పించుకొని ఎంతో కొంత ఇస్తుంటారు. ఇలా ఉపాధి కోసం తెల్లవారుజామునే వచ్చిన వారి బతుకులు చితికిపోయాయి.
స్థానికంగా వాటర్‌ప్లాంట్ నిర్వహించే నిందితుడి తండ్రి వాహనాన్ని తానే నడిపానని ఒకసారి.. డ్రైవర్ తీసుకెళ్లి ఉంటాడని మరోసారి చెప్పి నమ్మించడానికి ప్రయత్నించాడని సీపీ వెల్లడించారు. పలు కోణాల్లో విచారించగా చివరకు తన కొడుకే వాహనాన్ని తీసుకెళ్లాడని తెలిపినట్లు వివరించారు. కారు నడిపిన బాలుడు స్థానిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుండగా.. వెంట ఉన్న ఇద్దరు బాలురు పదోతరగతి చదువుతున్నట్లు తెలిసింది. మరోవ్యక్తి వేరే పాఠశాలలో పదో తరగతి అభ్యసిస్తున్నట్లు సమాచారం. వీరంతా స్నేహితులు కావడంతో తరచూ కారు తీసుకువెళ్లి నగరంలో షికారు చేసినట్లు తెలిసింది. ఉదయం వేళ పొగమంచు సమయంలో వేగంగా కారు నడపడంతో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. బ్రేక్ బదులు యాక్సిలేటర్‌ను బలంగా తొక్కి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో వీరు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.