Kanpur Bus Accident. (Photo Credits: ANI)

Kanpur, January 31: యూపీలోని కాన్పూర్ లో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో (Kanpur Bus Accident) అదుపుతప్పిన ఓ ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణికులను ఢీకొనడంతో ఆరుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు కాన్పూరులో ఈ ఘటన జరిగింది. కాన్పూర్‌లోని టాట్ మిల్ క్రాస్‌రోడ్డు సమీపంలో ఓ ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి పలువురు ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు (6 Dead, Several Others Injured) స్థానిక పోలీసులకు సమాచారం అందింది.ఈ ప్రమాదంలో మూడు కార్లు, పలు బైక్‌లు, బస్సు ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవరు కోసం వెతుకుతున్నామని తూర్పు కాన్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ తెలిపారు.క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ తెలిపారు.రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సంతాపం తెలిపారు.

రైలు ప్యాంట్రీ కారులో మంటలు తృటిలో తప్పిన ప్రమాదం, ప్రయాణకులంతా క్షేమం

కాన్పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకర వార్త. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రియాంకగాంధీ హిందీలో ట్వీట్ చేశారు.