Ganesh Laddu Auction: ఏకంగా కోటీ 20లక్షలు పలికిన గణేషుడి లడ్డు, మాదాపూర్‌లో రికార్డు బద్దలు కొట్టే వేలంపాట, రిచ్‌మండ్ విల్లాలోని గణేషుడి లడ్డూకు భారీ డిమాండ్
హైదరాబాద్ మాదాపూర్‌లోని (Madapur) రిచ్‌మండ్ విల్లాలో (Richmond Villa’s) గణనాథుడి లడ్డూ రూ.కోటి 20 లక్షలు పలికింది. ఇక మైహోమ్ భుజాలోని (My Home Bhooja) గణేశుని లడ్డూని రూ.25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్ (Chiranjeevi Goud) అనే వ్యక్తి దక్కించుకున్నారు.
Hyderabad, SEP 28: నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి లడ్డు వేలంలో (Ganesh Laddu Auction) రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. హైదరాబాద్ మాదాపూర్‌లోని (Madapur) రిచ్‌మండ్ విల్లాలో (Richmond Villa’s) గణనాథుడి లడ్డూ రూ.కోటి 20 లక్షలు పలికింది. ఇక మైహోమ్ భుజాలోని (My Home Bhooja) గణేశుని లడ్డూని రూ.25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్ (Chiranjeevi Goud) అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతేడాది కంటే రూ.7 లక్షలు అధికంగా ధర పలికింది. 2022లో రూ.18.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే.
కాగా, మరికాసేపట్లో బాలాపూర్ (Balapur) గణేశుడి లడ్డూ వేలం ప్రారంభం కానుంది. ఈ సారి పాతిక లక్షలు దాట నుందని ఉత్సవ కమిటీ సభ్యులు భావిస్తున్నారు. గతేడాది వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి రూ.24.60 లక్షలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్న విషయం తెలిసిందే.