Ganesh Visarjan 2020: బైబై గణేశా..నిఘా నీడలో హైదరాబాద్, వినాయక నిమజ్జనానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన సీపీ అంజనీకుమార్

తెలంగాణ రాజధానిహైదరాబాద్ మహాన‌గ‌న‌రంలో గ‌ణేశ్ నిమజ్జనానికి (Ganesh Visarjan 2020) రంగం సిద్ద‌మైంది. వివిధ రూపాల్లో పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గ‌ణ‌నాథులు కొద్ది గంటల్లో బైబై చెప్ప‌నున్నారు. హైద‌రాబాద్ అన్ని వైపుల‌ నుంచి విగ్రహాలు బాలాపూర్‌ గణేష్‌తో కలిసి మెయిన్ రోడ్‌లో పయనించి హుస్సేన్‌ సాగర్‌లో మంగళవారం నిమజ్జనం (Hyderabad Ganesh Immersion) కానున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ 21 క్రేన్లను సిద్ధం చేశారు అధికారులు. ఇక ఖైరతాబాద్‌ గణపతి ఊరేగింపు ఉద‌యం ప‌దిన్న‌ర‌కు ప్రారంభ‌మై, మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి చేస్తామని అధికారులు వెల్ల‌డించారు

Five cops face music for not registering case (PHOTO-TWITTER)

Hyderabad, Sep 1: తెలంగాణ రాజధానిహైదరాబాద్ మహాన‌గ‌న‌రంలో గ‌ణేశ్ నిమజ్జనానికి (Ganesh Visarjan 2020) రంగం సిద్ద‌మైంది. వివిధ రూపాల్లో పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గ‌ణ‌నాథులు కొద్ది గంటల్లో బైబై చెప్ప‌నున్నారు. హైద‌రాబాద్ అన్ని వైపుల‌ నుంచి విగ్రహాలు బాలాపూర్‌ గణేష్‌తో కలిసి మెయిన్ రోడ్‌లో పయనించి హుస్సేన్‌ సాగర్‌లో మంగళవారం నిమజ్జనం (Hyderabad Ganesh Immersion) కానున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ 21 క్రేన్లను సిద్ధం చేశారు అధికారులు. ఇక ఖైరతాబాద్‌ గణపతి ఊరేగింపు ఉద‌యం ప‌దిన్న‌ర‌కు ప్రారంభ‌మై, మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి చేస్తామని అధికారులు వెల్ల‌డించారు.

వినాయ‌క ఊరేగింపు, నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో సిటీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు పోలీసులు. ఈ ఆంక్షలు మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ అమల్లో ఉంటాయని ‌ తెలిపారు. మెయిన్ రూట్స్‌లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా ఏరియాల్లో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రాణించాలి. నెక్లెస్‌రోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లపై కేవ‌లం గ‌ణ‌నాథుడి నిమజ్జనానికి వచ్చే వాహనాలకు మాత్రమే ప‌ర్మిష‌న్ ఇస్తారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారు.. వచ్చేవారు.. ఓ.ఆర్‌.ఆర్ మీదుగా రాకపోకలు కొనసాగించడం మంచింది. ఇమ్లీబన్‌, జేబీఎస్‌లకు రాకపోకలు సాగించే జిల్లాల బస్సులు ఊరేగింపు లేని రూట్ల‌ను ఎంచుకోవాలి. ప్రజలు, భక్తులు సమాచారం కోసం 040-2785 2482, 9010203626 కాల్ చేయాలని సూచించారు. డాలర్‌ బాయ్ ఒత్తిడి మేరకే వారి పేర్లు చేర్చానని తెలిపిన బాధిత యువతి

నగరంలో గణేష్‌ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ (CP Anjani kumar) తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. నిమజ్జనానికి 15వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు సాగుతున్నాయిని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా యువకుడికి శ‌స్త్ర‌చికిత్స

ఇప్పటికే బాలాపూర్ గణేషుడు నిమజ్జనం అయ్యాడు, మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం నిమజ్జనం అయిపోతుందని చెప్పారు.కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.ఈ రోజు అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తులు, ఉత్సవ సమితి నాయకులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ అటవీశాఖకు రెండు జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పురస్కారాలు

విగ్రహాల తరలింపునకు వాహనాలు లభించని వారికి పోలీసులే ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు హ్యాండ్‌ హెల్డ్‌ కెమెరాలను వాడి ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించనున్నారు. బందోబస్తు కోసం నగర పోలీసులతో పాటు సాయుధ బలగాలూ మోహరించనున్నాయి. విధుల్లో ఉండే సిబ్బందికి షిఫ్ట్‌ విధానం అమలు చేస్తూ వారికి అవసరమైన ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్స్‌ అందిస్తున్నారు. బాలాపూర్‌ గణేశ్‌ నిమజ్జనం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలీసు అధికారులు ఇతర విభాగాలతో పాటు శాంతి, మైత్రి సంఘాలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారు.

ఏర్పాట్ల వివరాలివి

నిమజ్జనం జరిగే ప్రదేశాలు: ట్యాంక్‌బండ్, రాజన్న బౌలి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట చెరువు, షేక్‌పేట చెరువు, సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్, సఫిల్‌గూడ/మల్కాజ్‌గిరి చెరువులు, హస్మత్‌పేట చెరువు.

హుస్సేన్‌సాగర్‌కు వచ్చేవి: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు శివారులోని మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని విగ్రహాలు.

ఊరేగింపుల్లో డీజేలు నిషేధం: నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఇలాంటి తీవ్రమైన శబ్దం వచ్చే వాటివల్ల పోలీసు కమ్యూనికేషన్‌ వ్యవస్థకు నష్టం ఉంటుంది.

మద్యం విక్రయాలు బంద్‌: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలు నిషేధిస్తూ హైదరాబాద్‌ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నగర వ్యాప్తంగా మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని, మద్యం విక్రయాలు జరపకూడదని ఆదేశించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now