Heart Touching Video: రైతు కష్టాలపై పదేళ్ల బాలుడి వీడియో, ఆఘమేఘాల మీద సమస్యను తీర్చిన తెలంగాణ ప్రభుత్వం, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పంటపొలాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే ఓ రైతుకు చెందిన ఆరెకరాల భూమి కూడా నడుము లోతు వరద నీటిలో మునిగిపోయి చెరువును తలపిస్తోంది.
Hyderabad, Sep 22: తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పంటపొలాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే ఓ రైతుకు చెందిన ఆరెకరాల భూమి కూడా నడుము లోతు వరద నీటిలో మునిగిపోయి చెరువును తలపిస్తోంది.
మరో 15 రోజుల్లో కోతలు పట్టాల్సి ఉండగా..తమ పొలం మునిగిపోవడంపై ఆ రైతు మనవడు అరుణ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. పీకల్లోతు నీళ్లలో మునిగి (deep waters) ప్రభుత్వానికి రైతుల సమస్యలను తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ పార్టీ దీనిని షేర్ చేస్తూ అధికార పక్షానికి సూటి ప్రశ్నలు విదిల్చింది.
ఘటన వివరాల్లోకెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అర్రూర్ గ్రామానికి చెందిన రైతు దొంతి అయిలయ్య మనవడు. పేరు వరుణ్. ఐదో తరగతి చదువుతున్నాడు. అయిలయ్య, తనకున్న ఆరు ఎకరాల్లో వరి పంట వేశాడు. ఇప్పటిదాకా రూ.1.5లక్షలు ఖర్చయింది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బోరు, మోటరు, స్టార్టర్ సహా పొట్టదశలో ఉన్న పంటంతా మూడు అడుగల మేర నీట మునిగింది. ఈ పొలం అంతా కూడా కాండ్లబావికుంట ఎగువ భాగంలోని శిఖం పట్టా. కుంట నిండితే అదనపు నీరు బయటకు పొర్లేందుకు అలుగు ఏర్పాటు లేదు. ఆ నీటిని తూము ద్వారానే వదలాల్సి ఉంటుంది. దీంతో కుంట నిండినప్పుడల్లా అయిలయ్య పొలం నీళ్లపాలవుతోంది.
Here's Video
పంటంతా నీట మునగడంతో అప్పులు మిగిలాయని అయిలయ్య పడుతున్న ఆవేదన చూసిన మనవడు వరుణ్...తాత ఇబ్బందులను బయట ప్రపంచానికి తెలిపేందుకు బోరు దగ్గర చుట్టూ చేరిన నీళ్లలో కూర్చుని.. మేనమేమ సాయంతో మూడు రోజుల క్రితం ఓ వీడియో రూపొందించాడు. టీవీ ష్లోల్లో.. సినిమాల్లో చూపించినట్లుగా రైతులు (Farmers problems) ఉండరు.
మా పొలం మునిగిపోయినందుకు నష్టపరిహారం అడగట్లేదు.. కాండ్లబావికుంట తూము సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారిని (Request to telangana govt) వేడుకుంటున్నాను. రైతు పండించిన అన్నమే తింటూ రైతుల కష్టాలు ఎందుకు పట్టించుకోరు? కంపెనీలు చేసే వేల కోట్ల అప్పులు తీరుస్తున్న ప్రభుత్వం.. రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోదు?'' అంటూ ఒకటిన్నర నిమిషాల విడియోల వరుణ్ సూటి ప్రశ్నలు సంధించాడు
వరదనీరు బయటకు వెళ్లడానికి తూము అనుకూలంగా లేదని, అందుకే పంట పొలం నీట మునిగిందని ఆవేదన వ్యక్తంచేశాడు. తమకు నష్టపరిహారం వద్దని, తూము సమస్యను పరిష్కరించాలని .జిల్లా కలెక్టర్‌ను బాలుడు వేడుకున్నాడు. ఇప్పుడీ వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు హైలైట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రిగారూ.. ఈ 10ఏళ్ల పిల్లాడికి సమాధానం చెప్పడం.. హౌజ్ అరెస్టు చేసినంత తేలికకాదు..'' అని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియోపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఎట్టకేలకు స్పందించారు. వరుణ్ చెప్పిన రైతు సమస్యపై విచారణ జరపాలని సిబ్బందిని ఆదేశించారు. చివరికి ప్రభుత్వ యంత్రాంగం కదిలొచ్చి.. కాండ్లబావికుంట తూములోంచి నీళ్లు వెళ్లిపోయే ఏర్పాటు చేయడంతో వరుణ్ కుటుంబం ఇబ్బందులు తాత్కాలికంగా తొలగిపోయాయి.