Heavy Rain Alert: రాబోయే వారంరోజులు తెలంగాణలో వర్షాలు, పలు జిల్లాలకు అలర్ట్ జారీచేసిన ఐఎండీ, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. సెప్టెంబర్‌ 3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Representational Image (File Photo)

Hyderabad, SEP 01: వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. సెప్టెంబర్‌ 3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 2, 3, 4వ తేదీల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Telangana Shocker: రాత్రి ఇంట్లో మద్యం సీసాలు, అక్క అనుమానాస్పద మృతి, తెల్లారేసరికి ప్రియుడితో చెల్లెలు పరార్, మిస్టరీగా మారిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి 

శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌, కొమరంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.