CM Revanth Reddy Slams KCR: పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వందేళ్ల విధ్వంసం, బీఆర్ఎస్ అధినేతపై మండిపడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఇవ్వనున్న ప్రత్యేక నిధులు, అనుమతులను అందులో పొందుపరుస్తామని చెప్పారు.

CM Revanth Reddy Anumula (photo-TS CMO)

Hyd, April 02: రానున్న లోక్‌సభ ఎన్నిలకు తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఇవ్వనున్న ప్రత్యేక నిధులు, అనుమతులను అందులో పొందుపరుస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 6న నిర్వహించనున్న ‘జనజాతర’ సభ ఏర్పాట్లను మంత్రులు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. కోలుకోలేని విధంగా బీఆర్ఎస్ నేతలు ఆర్థిక, సహజ వనరులను దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనతో రాష్ట్రంలో కరవు వచ్చిందంటూ ఇటీవల కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 వేల పుస్తకాలు చదివిన ఆయనకు వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా తెలియదా?అని ఎద్దేవా చేశారు. 1000 ట్యాంకర్లతో బుక్ చేసిన 12 గంటల్లో నీటిని సరఫరా చేస్తున్నాం మమ్మల్ని అభినందించకుండా కేసీఆర్ తిడుతున్నారని మీరు అంటున్నారని మండిపడుతున్నారు.

రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 వ తేదీ సాయంత్రం సభ నిర్వహించనున్నట్లు.. సభకు తెలంగాణ జనజాతర పేరు ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. జన జాతర వేదిక మీది నుండి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాహుల్..ప్రియాంక గాంధీ హాజరవుతారని, ఐదు గ్యారంటీలు వేదిక మీదనుండి ఇస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కి ప్రత్యేకమని, సోనియాగాంధీ కి మరీ ప్రత్యేకమన్నారు. సోనియాగాంధీ దయ.. ప్రేమ వల్ల రాష్ట్రం ఏర్పాటు అయ్యిందన్నారు.  రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా? కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలా?, తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన మందకృష్ణ మాదిగ

కేసీఆర్ నాయకత్వం లో వందేళ్ల విద్వంసం చేశారని, సూపర్ సిక్స్.. ఆరు గ్యారంటీలు ఇచ్చారు సోనియాగాంధన్నారు. మిగిలి ఉన్న హామీలు ఎన్నికల తర్వాత అమలు చేస్తామన్నారు. కేసీఆర్ పొలం బాట పట్టారు సంతోషమని, పదేళ్ల తర్వాత అయినా రైతులు ఉన్నారని గుర్తు వచ్చింది ఆయనకు అంటూ సెటైర్లు వేశారు. అధికారం కోల్పోయిన దుఃఖం లో ఉన్నాడని, కూతురు జైల్లోకి పోకుంటే.. జనంలోకి వచ్చాడన్నారు. కేసీఆర్ తీరు ఆక్షేపనియమని, 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కి వాన కాలం ఎప్పుడు వస్తది.. ఎండ కాలం ఎప్పుడు వస్తుందో తెలియదా అని ఆయన వ్యాఖ్యానించారు.  వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య, మిగతా మూడు స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

అంతేకాకుండా..’వానాకాలం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే. కేసీఆర్ వారసత్వం గా కరువు..అప్పులు వచ్చాయా. మీపాపాలు మాకు అంట గట్టడం ఏంది. మేము వచ్చింది ఎప్పుడు.. కరువు తెచ్చింది ఎప్పుడు. నువ్వు చేసిన పాపాలు..మాకు తగిలాయి. తండ్రుల పాపం పిల్లలకు తాకినట్టు. నీ లెక్క తప్పు అయితే.. ముక్కు నేలకు రాయాలి. కరెంట్ పోయింది అని సిగ్గులేకుండా చెస్ప్పిండు కేసీఆర్. జనరేటర్ మీద ప్రెస్ మీట్ పెట్టిండు. కరెంట్ అర నిమిషం కూడా అక్కడ పోలేదు. నీ జనరేటర్ లో పుల్ల ఎవడో పెట్టాడు. జగదీశ్ రెడ్డి పడనోడు ఎవడో చూసుకో. నీ పార్టీలో పుల్ల పెడుతుంది ఎవడో తెలుసు కో. మేము ధర్నా చేస్తే మమ్మల్ని బయకు పోనివ్వలేదు.

నేనే పోలీసులకు చెప్పి అన్ని సహకారాలు చేయండి అని చెప్పిన.. నీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి.. పాపపు సొమ్ము లో 100 కోట్లు రైతులకు ఇవ్వొచ్చు కదా.. రైతుల మీద రాజకీయం చేయాలని చూస్తున్నాడు.. ప్రతిపక్ష నాయకుడివి ఇంకా బాగా తిరుగు.. తాలు పేరుతో మోసం చేస్తే తిత్తి తిస్తాం.. నేను మా ఇంట్లోనే పడుకుంటున్న.. ఆయన లెక్క ఫార్మ్ హౌస్ లో పడుకోలేదు.. కాళేశ్వరంకి మేడిగడ్ద వెన్నుపూస లాంటిది.. నీలాగే దివాళా సంసారం చేయను.. అన్నారం బొక్కే పడింది.. మేడిగడ్డ నుండి నీళ్ళు అన్నారం లోకి ఎలా విడుదల చేస్తారు.. మేడిగడ్డ మూడు నెలల ముందు కూలింది.’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif