Innohub IT Company Fraud: రూ. 2 లక్షలు కడితే సాఫ్ట్‌వేర్ జాబ్, బ్యాక్ డోర్ ఉద్యోగాలు నమ్మి రోడ్డున పడ్డ 800 మంది నిరుద్యోగులు, రూ. 20 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఇన్నోహబ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ

హైదరాబాద్ మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇన్నోహబ్ అనే ఐటీ సంస్థ నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మార్చుకుని వారి వద్ద అందినంత దోచుకుని దుకాణం ఎత్తేసింది. ఈ దెబ్బతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు (Cheating 800 Employees) రోడ్డున పడ్డారు

Innohub Technologies

Hyd, May 30: హైదరాబాద్ మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇన్నోహబ్ అనే ఐటీ సంస్థ నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మార్చుకుని వారి వద్ద అందినంత దోచుకుని దుకాణం ఎత్తేసింది. ఈ దెబ్బతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు (Cheating 800 Employees) రోడ్డున పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ జాబ్ పేరిట ఒక్కో నిరుద్యోగి నుంచి 2 లక్షల వరకు వసూలు చేసింది.

ఈ క్రమంలో సుమారు 20 కోట్లు వరకు నిరుద్యోగుల నుంచి వసూలు (Rs 20 crore and flipped the board ) చేసి వారికి రెండు నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చి జీతాలు ఇచ్చారు. అయితే అకస్మాత్తుగా ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ సంస్థ రెండు వారాల క్రితం కంపెనీ వెబ్సైట్,మెయిల్స్ బ్లాక్ చేసింది. దీంతో షాకైన ఉద్యోగులు సమాచారం ఆరా తీసేందేకు ప్రయత్నించగా సంస్థకు సంబంధించి ఉద్యోగులు,బోర్డ్ లేకపోవడంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్నారు. దీనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారుల ఖాతాల్లో రూ. కోట్లు డిపాజిట్, సాప్ట్‌‌వేర్ లోపం ఇలా జరిగినట్టు తెలిపిన బ్యాంక్ అధికారులు, వికారాబాద్‌జిల్లాలో ఓ వ్యక్తి అకౌంట్‌లో ఏకంగా రూ. 18కోట్లు జమ

ఈ ఘటనపై మాదాపూర్‌ సీఐ రవీంద్ర ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ‘మే 28 న హన్మకొండ కు చెందిన యువకుడు తమకు ఫిర్యాదు (Case Against Madhapur IT Firm) చేశారు. కొత్తగూడలోని ఇన్నోహాబ్ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిరుద్యోగుల నుంచి లక్షన్నర రూపాయల చొప్పున వసూలు చేసినట్టు తెలిసింది. ఆ తరువాత బోర్డు తిప్పేసి నిందితులు పారిపోయారు. ఉద్యోగం ఇచ్చిన తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి బుకాయించారు. ఇప్పటి వరకు 60 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. బ్యాక్ డోర్ ఉద్యోగాలను నమ్మొద్దు. అలా డబ్బులు ఇచ్చి ఉద్యోగం తీసుకున్నారంటే మీరే ఎంకరేజ్ చేస్తున్నట్లు. ప్రస్తుతం కంపెనీకీ సంబంధించి కమలేష్ కుమారి, రాహుల్ అలోక్, వైష్ణవి, ముద్ర, ప్రదీప్‌గా గుర్తించాం. వీళ్లంతా హెచ్ ఆర్, మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన వాళ్లు. వీరిని విచారిస్తున్నామని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement