HDFC Bank net banking, mobile app down for 2nd day in row (Photo-Wikimedia)

వికారాబాద్‌జిల్లాలోని ఓ వ్యక్తి అకౌంట్‌లో ఏకంగా రూ. 18 కోట్లు జమయ్యాయి. బ్యాంక్‌ ఖాతా చెక్‌ చేసి షాకైన సదరు బ్యాంక్‌ ఖతాదారుడు బ్యాంక్‌ అధికారులను సంప్రదించాడు. వివరాల ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన వ్యాపారి వెంకట్‌రెడ్డికి జాక్‌పాట్‌ తగిలింది. అతడి HDFC బ్యాంక్‌ ఖాతాలో ఏకంగా రూ. 18.52 కోట్లు జమయ్యాయి. డబ్బులు పడిన విషయం తెలుసుకున్న వెంకట్‌రెడ్డి.. బ్యాంక్‌ అధికారులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా.. నిన్న(ఆదివారం) కూడా తమిళనాడులో HDFC బ్యాంకుకు చెందని పలువురి ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీంతో సంబంధిత బ్యాంకు అధికారులు అలర్ట్‌ అయ్యారు.

ఇక చెన్నైలో ఓ వందమంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(HDFC Bank) వినియోగదారుల‌ ఖాతాలకు రూ13 కోట్ల చొప్పున డ‌బ్బు డిపాజిట్ అయ్యింది. వీరితో పాటు మరి కొందరికి రూ. లక్షల న‌గ‌దు వ‌చ్చి చేరింది. ఈ స‌మాచారం వారికి ఎస్ ఎంఎస్ రూపంలో అంద‌టంతో కొందరు బ్యాంకులకు పరుగులు తీశారు.తమ మొబైల్​ ఫోన్లకు వచ్చిన మెసేజ్​లు చూసి షాక్ అయ్యారు. రూ.13 కోట్లు జమ కావడంతో అవాక్కయ్యారు. సాంకేతిక కారణాలతో కోట్లాది రూపాయలు డిపాజిట్ కావడం గమనార్హం.

ఆధార్ వాడకంపై కేంద్రం కీలక సూచన, ఎక్కడపడితే అక్కడ ఆధార్ ఇవ్వొద్దు, మాస్క్ డ్ ఆధార్ వాడాలంటూ సూచన, మాస్క్‌ డ్ ఆధార్ అంటే ఏమిటి? ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా?

చెన్నైలోని త్యాగరాయ నగర్ హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంకులో జరిగింది. తమ తప్పిందని గ్రహించిన బ్యాంకు అధికారులు.. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. సరిదిద్దు బాటు చ‌ర్య‌లు చేపట్టారు. ఆ నగదును వెనక్కి తీసుకున్నారు.సాప్ట్‌‌వేర్ లోపం ఇలా జరిగినట్టు తెలిపారు. ఈ 100 మందే కాకుండా మరి కొంత మంది(HDFC Bank) ఖాతాలకు రూ.10,000, రూ.50,000, రూ.లక్ష నగదు డిపాజిట్ అయ్యిన‌ట్టు అధికారులు గుర్తించారు.

కాగా, టి.నగర్‌ (HDFC Bank) బ్యాంక్‌లో ఇటీవల సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయ‌డం వల్ల వందమంది ఖాతాల్లో తలా రూ.13 కోట్ల, మరి కొందరికి రూ10 వేల నుంచి రూ.లక్ష వరకూ జమ అయ్యింది. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 100 ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అయినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు డబ్బు డ్రా చేయడం గమనార్హం. మరోవైపు ఈ విషయంపై ఫెడరల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై (HDFC Bank) బ్యాంకు సిబ్బంది తమకు అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.