Rain Alert: తెలంగాణ‌కు భారీ వర్ష సూచ‌న‌, రెండు రోజుల పాటూ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అల‌ర్ట్

బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు.. సముద్ర మట్టానికి 3.1కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్యలో ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించారు.

Monsoon 2024 Arrives in India: IMD Declares Southwest Monsoon Onset Over Kerala, Above Normal Rainfall Likely

Hyderabad, July 11: తెలంగాణ‌లో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rain alert) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) తెలిపింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు.. సముద్ర మట్టానికి 3.1కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్యలో ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించారు. ఏపీ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ఆనుకొని కేంద్రీకృతమైన ఆవర్తనం బలహీనపడిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

IPS Transfers In Telangana: తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్ అధికారుల బ‌దిలీ, మ‌హేష్ భ‌గ‌వ‌త్, స్వాతి ల‌క్రా, స్టీఫెన్ ర‌వీంద్ర సహా ప‌లువురు సీనియ‌ర్ల ట్రాన్స్ ఫ‌ర్ 

మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ. వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే అవకాశముందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బుర్గంపాడులో బుధవారం అత్యధికంగా 6.40 సెం.మీ వర్షం కురిసింది.