Hyderabad, July 10: తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ (IPS Officers Transfer) అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్ (Mahesh Bhavath) బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతిలక్రా (Swati lacra), గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర నియామకమయ్యారు. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్‌కుమార్‌ను నియమించింది. పోలీస్ సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా విజయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
In #Telangana gov transfers of fifteen #IPS officers. Mahesh Bhagwat, ADG of Railways and Road Safety is now appointed as ADG (Law and Order). Swati Lakra, IPS (1995)ADG TGSP Battalion transferred and posted as ADG Organization & #HomeGuards pic.twitter.com/2IBc7LwJ6n
— Deepika Pasham (@pasham_deepika) July 10, 2024
టీజీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబు, ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి, మల్టీజోన్-1 ఐజీగా ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, రైల్వే, రోడ్‌స్టేఫ్టీ ఐజీగా కే రమేశ్ నాయుడు, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్‌రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్ గిరిధర్‌ను బదిలీ చేసింది. హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీగా బీ బాలస్వామి, వెస్ట్‌జోన్ డీసీపీగా జీ చంద్రమోహన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షితమూర్తి నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.