Hyderabad Metro Rail: మెట్రోలో ప్రయాణిస్తున్నారా..అయితే ఈ గైడ్‌లైన్స్ తప్పక తెలుసుకోవాలి, 300 మందికి మాత్రమే ఒక్కో రైలులో ప్రయాణం, స్మార్ట్‌కార్డ్ సేవలతో కరోనా దూరం

ఈ క్రమంలో హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్‌ వీ ఎస్‌ రెడ్డి (Metro MD NVS Reddy) ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాల (Guidelines) గురించి వివరించారు. అన్‌లాక్‌ 4కు అనుగుణంగా ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు (Hyderabad Metro Rail Limited) పున: ప్రారంభిస్తున్నామని తెలిపారు. అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అందరూ ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Hyderabad Metro Rail (Photo-wikimedia commons)

Hyderabad, Sep 6: జనతా కర్య్ఫూ నుంచి నిలిచిపోయిన మెట్రో సేవలు (Hyderabad Metro Rail) సెప్టెంబర్ 7 ఏడు నుంచి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్‌ వీ ఎస్‌ రెడ్డి (Metro MD NVS Reddy) ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాల (Guidelines) గురించి వివరించారు. అన్‌లాక్‌ 4కు అనుగుణంగా ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు (Hyderabad Metro Rail Limited) పున: ప్రారంభిస్తున్నామని తెలిపారు. అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అందరూ ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. మార్కింగ్‌కు తగ్గట్టుగా ప్రయాణీకులు ఫాలో అవ్వాలని అన్నారు. నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తామని, నగదు రహిత లావాదేవీలు జరుపుతామని తెలిపారు.

ప్రయాణికులు ఆన్‌లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాలి. ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ఫేస్ మాస్క్ తప్పనిసరి. లేనివారు స్టేషన్‌లో కొనుక్కోవాలి. ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం. నార్మల్ టెంపరేచర్ ఉంటేనే అనుమతిస్తాం. హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంటుంది’ అని తెలిపారు.

వెయిటింగ్ లిస్టు ఉండదు, ఈ నెల 10 నుంచి 80 ప్రత్యేక రైళ్లకు బుకింగ్ ప్రారంభం

అలాగే‘ప్రయాణికులు మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్‌తో రావాలి. 75 శాతం ఫ్రెష్ ఎయిర్ ట్రైన్‌లో అందుబాటులో ఉంటుంది. అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతాము. ప్రతి స్టేషన్‌లో ఐసోలేషన్ రూంలు ఏర్పాటు చేస్తాం. మొదటి వారంలో రోజుకు 15 వేల మంది ప్రయాణీకులు వస్తారని అంచనా వేస్తున్నాం. ప్రతి స్టేషన్‌లో మెట్రో రైల్ 30-50 సెకన్లు ఆగుతుంది’ అని తెలిపారు.

గతంలో ఒక్కో రైలులో (Hyderabad Metro) 1,000 మంది ప్రయాణించే వారని, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం 300 మంది వరకు మాత్రమే ప్రయాణించడానికి అవకాశముందని తెలిపారు. కాయిన్స్, కరెన్సీ వాడకం ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశముందని మెట్రో అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు ఇది వరకే కలిగి ఉన్న స్మార్ట్‌ కార్డు ద్వారా క్యూఆర్‌కోడ్‌ టికెటింగ్‌తో ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణం ముగిసిన ప్రతీసారి క్యూఆర్‌ కోడ్‌ను స్కానింగ్‌ చేయాలని తెలిపారు.

బీకేర్‌పుల్..పెట్రోల్ బంకుల్లో భారీ మోసం, చిప్‌లతో కస్టమర్ల జేబులకు చిల్లు, ముఠాను అరెస్ట్ చేసిన సైబరాాబాద్ పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన సీపీ సజ్జనార్

భౌతికదూరం పాటిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. లిఫ్ట్‌లో కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతిస్తారు. కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించిన భరత్‌నగర్, మూసాపేట, యూసుఫ్‌గూడ, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్‌ స్టేషన్లలో రైలు ఆగదు. రైలులో క్రాస్‌ మార్కు పెట్టిన చోట కూర్చోకూడదు. మార్కు చేసిన ప్రాంతంలోనే నిలబడాల్సి ఉంటుంది. వైద్యం, అత్యవసర సేవల కోసం 7995999533 నంబర్‌ను సంప్రదించవచ్చని మెట్రో అధికారులు తెలిపారు.

రైల్లో 75 శాతం తాజా గాలి ఉండేలా టెర్మినల్స్‌ వద్ద రైళ్ల డోర్స్‌ను ఎక్కువ సమయం తెరిచి ఉంచుతామని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలును నడిపిస్తామని, ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామని పేర్కొన్నారు.

మొదటి దశలో కారిడార్‌ 1 మియాపూర్, ఎల్‌బీనగర్‌ మార్గంలో ఈ నెల 7 నుంచి మెట్రోరైల్‌ అందుబాటులోకి రానుందని చెప్పారు. రెండో దశలో కారిడార్‌ 3 నాగోల్, రాయదుర్గ్‌ మార్గంలో, 8వ తేదీ, 9వ తేదీల్లో కారిడార్‌ 2తో పాటు అన్ని ఇతర మార్గాల్లో సర్వీసులు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. అన్‌లాక్‌ – 4 నిబంధనలు పాటిస్తూ సర్వీసులను నడిపిస్తామన్నారు.



సంబంధిత వార్తలు

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif