Hyderabad Shocker: వాట్సాప్ గ్రూపుల్లో కాలేజీ విద్యార్థినుల న్యూడ్ ఫోటోలు, వస్తావా అంటూ ఆకతాయిల మెసేజ్‌లు, ఘట్‌కేసర్‌లో కాలేజీ ముందు ధర్నాకు దిగన విద్యార్థినులు
హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల మార్పింగ్ న్యూడ్ ఫొటోలు (Unknown man Sends Obscene Photos ) కలకలం రేపాయి.ఈ కాలేజీ అమ్మాయిల (College Girls) ఫొటోలను మార్ఫింగ్ చేసి కొందరు ఆకతాయిలు వాటిని వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు.
Hyd, Jan 5: హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల మార్పింగ్ న్యూడ్ ఫొటోలు (Unknown man Sends Obscene Photos ) కలకలం రేపాయి.ఈ కాలేజీ అమ్మాయిల (College Girls) ఫొటోలను మార్ఫింగ్ చేసి కొందరు ఆకతాయిలు వాటిని వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు. ఈ ఫోటోల ఆధారంగా వారికి ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థినిలు బుధవారం అర్ధరాత్రి ఘట్‌కేసర్ లోని వీబీఐటీ (విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీ) దగ్గర ధర్నా చేపట్టారు.
వీళ్లకు విద్యార్థి సంఘాలు కూడా తోడు కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఆకతాయిలు ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల ఫొటోలను సేకరించి.. వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేశారు. అంతటితో ఆగకుండా వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. వాటిని చూపిస్తూ.. వాట్సాప్ గ్రూపుల్లో చేరి వీడియో కాల్స్ చేయాలని యువతులను బెదిరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ పరిమాణం వెనుక ఎవరున్నారేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కూతుర్ల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే విద్యార్థినుల ధర్నా చేపట్టిన సమయంలో ఆగంతకుల నుంచి వార్నింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించినట్లు విద్యార్థినులు చెప్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు చెప్తున్నారు.