Hyderabad: వాట్సప్ కాల్ ఎత్తగానే మొబైల్‌లోకి నగ్న వీడియోలు, ఇతరులకు పంపించకుండా ఉండాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి రూ.55 వేలు (Video call costs Hyderabad man Rs 55,000) ఇవ్వాలని అడగడం జరిగింది.

Video Calls | Representational Image (Photo Credits: Pixabay)

Hyd, Mar 28: ఆన్ లైన్ నేరగాళ్లు ఎక్కువైపోతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడేవారిని బ్లాక్ మెయిల్ చేసి లక్షలు గుంజుతున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన వ్యక్తి నుంచి ఓ నేరగాడు రూ.55 వేలు గుంజాడు. షాకింగ్ ఘటన వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లో 30 ఏళ్ల వ్యక్తి ఓ అనామక నంబర్‌ (anonymous number) నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్‌ రావడం.. అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి రూ.55 వేలు (Video call costs Hyderabad man Rs 55,000) ఇవ్వాలని అడగడం జరిగింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI)లో ప్రచురించిన నివేదిక ప్రకారం, అతను వాట్సాప్ (WhatsApp) కాల్‌ ఎత్తిన తర్వాత, అతను ఎటువంటి ఆడియో లేకుండా స్క్రీన్‌పై ఓ ఖాళీ వీడియోను చూశాడు. ఆ తర్వాత కాల్ అకస్మాత్తుగా కట్ చేయబడింది. కొన్ని నిమిషాల తర్వాత, అతనికి మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియో ఉన్న సందేశం వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే మీ వీడియోను తన పరిచయస్తులతో పంచుకుంటానని నిందితుడు బెదిరించాడు.

మరొక పెళ్లి డ్యాన్స్ వీడియో వైరల్, స్టార్‌గా మారిపోయిన చిన్నారి, ఇద్ద‌రు బాలుర‌తో క‌లిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన బుజ్జి పాప

కొద్ది రోజుల వ్యవధిలో బాధితురాలు నిందితులకు మూడు వాయిదాల్లో మొత్తం రూ.55 వేలు చెల్లించాడు. అయినా బెదిరింపులు, వసూళ్లు ఆగకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. చాలా మంది బాధితుల సంప్రదింపు నంబర్‌లను సాధారణంగా నిందితులు వివిధ సోషల్ మీడియా ఖాతాల నుండి యాదృచ్ఛికంగా యాక్సెస్ చేస్తారు. అనంతరం ఇలా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడతారు. దీనిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.



సంబంధిత వార్తలు

Uttar Pradesh: వీడియో ఇదిగో, చపాతీలు చేయడం దగ్గర్నుంచి అంట్లు తోమేదాకా ఇంట్లో పనులు చేస్తున్న కోతి, దాన్ని డబ్బుగా మార్చుకున్న యజమాని

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్