Heavy Rain Alert To Telugu States: రెయిన్ అలర్ట్..నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు బారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరిక

బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని వెల్లడించింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనం ప్రభావం పశ్చిమ బెంగాల్‌ పై కూడా ఉంటుందని తెలిపింది.

IMD Issues 4 Days Rain Alert To Telangana, Andhra Pradesh(X)

Hyd, Oct 5:  ఏపీ, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని వెల్లడించింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనం ప్రభావం పశ్చిమ బెంగాల్‌ పై కూడా ఉంటుందని తెలిపింది.

అల్ప పీడనం ప్రభావంతో ఇవాళ తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌ ను ముంచెత్తిన భారీ వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులూ వానలే

రేపు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.