Hyderabad, Oct 5: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్ పల్లి, జగద్గిరిగుట్ట, దుండిగల్, మేడ్చల్, కృష్ణాపూర్, కండ్లకోయ తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వాన పడుతున్నది. నగరం మొత్తం మేఘావృతమై ఉన్నది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మధురైలో కేసు నమోదు.. ఎందుకంటే?
బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లకు మరోసారి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. బంగాళాఖాతం (Bay of Bengal) లో మరో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో ఏపీ, తెలంగాణలో బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి