Udhayanidhi Stalin says 'Wait and see' after Pawan Kalyan took jibe at his remark on Sanatan Dharma

Vijayawada, Oct 5: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పై తమిళనాడులోని (Tamilnadu) మధురైలో ఓ కేసు నమోదైంది. వంజినాథన్ అనే న్యాయవాది ఈ మేరకు మధురై కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి స్టాలిన్‌ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో పవన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి

అసలేం జరిగిందంటే?

గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. దీనిని ఎవరూ నిర్మూలించలేరని, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారని వ్యాఖ్యానించారు. అయితే, పవన్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించే ఈ హెచ్చరిక చేశారన్న వార్తలొచ్చాయి. దీనికి కారణం లేకపోలేదు.  ఉదయనిధి స్టాలిన్ గతంలో ఒకసారి మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే పవన్ ఆయన్ని టార్గెట్ చేస్తూ పైవ్యాఖ్యలు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.

చార్మినార్‌ పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌ చ‌ల్‌.. ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు (వీడియో)

స్పందించిన ఉదయనిధి

పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి కూడా స్పందించారు. పవన్ కామెంట్స్‌ పై మీ స్పందనేంటన్న ప్రశ్నకు ‘వెయిట్ అండ్ సీ’ అని బదులిచ్చారు.