IPL Auction 2025 Live

Cheetah Helicopter Crash: చీతా విమాన ప్రమాదంలో అమరుడైన యాదాద్రి బిడ్డ వీవీబీ రెడ్డి, గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు, స్వగ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు

ఈ ఇద్దరిలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి యాదాద్రి జిల్లా బొమ్మలరామారంకు చెందిన మేజర్. దీంతో ఆయన స్వస్థలం బొమ్మలరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి.

Lt Col VVB Reddy (Photo-Twitter)

Hyd, Mar 17: అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్‌ ‘చీతా’ కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి యాదాద్రి జిల్లా బొమ్మలరామారంకు చెందిన మేజర్. దీంతో ఆయన స్వస్థలం బొమ్మలరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి.

చీతా హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి, అధికారికంగా ప్రకటించిన భారత ఆర్మీ, ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశాలు

తల్లిదండ్రులు నర్సింహ్మారెడ్డి, విజయలక్ష్మీలు. అయితే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్‌ గిరిలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన సతీమణి స్పందన కూడా ఆర్మీలో డెంటల్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.స్థానికంగా ఉన్న ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.