Cheetah Helicopter. (Photo Credits: ANI)

భారత ఆర్మీ ఛాపర్‌ చీతా అరుణాచల ప్రదేశ్ లో కుప్పకూలిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో పైలట్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ వీవీబీ రెడ్డితో పాటు కో పైలట్‌ మేజర్‌ జయంత్‌ కూడా మృతి చెందినట్లు భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.

గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్‌క్రాఫ్ట్‌.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్‌పూర్‌ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ వెస్ట్‌ కామెంగ్‌ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి.

మళ్లీ వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్‌, నాలుగో వేవ్ తప్పదనే భయాలు, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖలు

భారత సైన్యంతో పాటు ఐటీబీపీ మరో రక్షణ విభాగ సాయంతో మొత్తం ఐదు బృందాలు కూలిపోయిన పైలట్ల ఆచూకీ కోసం గాలించాయి. ఈ క్రమంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ దిరాంగ్‌ ప్రాంతం బంగ్లాజాప్ వద్ద గ్రామస్తులు కాలిపోతున్న ఛాపర్‌ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.

Here's ANI Tweet

దీంతో అక్కడి చేరుకున్న బలగాలు.. ఆపై పైలట్‌, కోపైలట్‌లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించారు. ప్రమాదానికి కారణాల గుర్తించేందుకు దర్యాప్తునకు ఆదేశించింది భారత ఆర్మీ.