Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hyd, Dec 16: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో అమరావతిలో వరద వల్ల ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదు.. ఏపీలో చంద్రబాబు రాగానే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందనేది తప్పుడు ప్రచారం మాత్రమే.. పెట్టుబడిదారులు అమరావతి కంటే హైదరాబాద్, బెంగళూరుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. ఆయనతో కూర్చొని మాట్లాడాలనే కోరిక ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ లో ఆదాయం పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఏడాది కాలంపై ఎలాంటి వ్యతిరేకత లేదు.. వైఎస్సార్ సమయంలో కూడా ఇలాగే ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. సభలో ఎవ్వరి పాత్ర వారిదే.. ప్రి విలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ల హక్కు అన్నారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే తెలంగాణలో అమలు చేస్తుందని వెల్లడించారు
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో ఓ సభ్యుడు జిల్లాల కుదింపుపై ప్రశ్న వేయగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను కూడా రద్దు చేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ... ఏ జిల్లాను రద్దు చేయబోమని, అసలు పాత జిల్లాలను రద్దు చేసే ఆలోచనే తమ ప్రభుత్వానికి లేదని వెల్లడించారు.