BRS MLC Kavitha Arrested: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన సీబీఐ, మధ్యాహ్నం తరువాత వాదనలు వింటామని తెలిపిన ధర్మాసనం
కవితను ఐదు రోజుల కస్టోడియల్ రిమాండ్ కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది.
New Delhi, April 12: మద్యం పాలసీ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అరెస్టు చేసిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నాయకురాలు కె కవితను శుక్రవారం ఉదయం రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితను ఐదు రోజుల కస్టోడియల్ రిమాండ్ కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది.సౌత్ గ్రూప్'కి చెందిన ఒక మద్యం వ్యాపారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని మరియు ఢిల్లీలో తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మద్దతు కోరారు. కేజ్రీవాల్ మద్దతు కోసం ఆయనకు హామీ ఇచ్చారని సీబీఐ కోర్టులో వాదించింది.
మా వద్ద తగినంత మెటీరియల్, వాట్సాప్ చాట్‌లు మరియు అనుబంధ నిందితుల వాంగ్మూలాలు ఉన్నాయి" అని సిబిఐ తెలిపింది. "విజయ్ నాయర్‌కు రూ. 100 కోట్లు ఇచ్చినట్లు అభిషేక్ బోయిన్‌పల్లి తెలియజేసినట్లు దినేష్ అరోరా (నిందితుడు టర్న్ అప్రూవర్) తన వాంగ్మూలంలో ధృవీకరించారు. సెక్షన్ 161 & 164 కింద హవాలా ఆపరేటర్ల ప్రకటన రూ. 11.9 కోట్లు చెల్లించినట్లు నిర్ధారించింది. బుచ్చిబాబు నుండి చాట్‌లు రికవరీ చేయబడ్డాయి. ఆమె ఇండోస్ప్రిట్స్‌లో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారని వెల్లడించాయి. నిందితుడు మనీష్ సిసోడియా ఒత్తిడి కారణంగా బ్లాక్‌లిస్ట్ చేసిన తర్వాత కూడా ఇండోస్ప్రిట్‌లకు లైసెన్స్‌లు ఇవ్వబడ్డాయి, ”అని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. సీబీఐ అరెస్టుపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత, అత్యవసరంగా విచారించాలని లాయర్ విజ్ఞప్తి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా సీబీఐ అరెస్ట్ చేసింది. నేరపూరిత కుట్ర, భారతీయ శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించి కవితను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి తీహార్ జైలులో బీఆర్‌ఎస్ నాయకురాలిని ఇప్పటికే ఏప్రిల్ 6న విచారించినట్లు సీబీఐ బుధవారం ఢిల్లీలోని సంబంధిత కోర్టుకు నివేదించింది.
రోస్ అవెన్యూ కోర్టు మంగళవారం కె కవితను ఏప్రిల్ 23, 2024 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆమెను ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. CBI Arrests Kavitha: తీహార్ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ, కేజ్రీవాల్‌లో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపణలు
కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ 2 గంటలకు వాయిదా వేసింది కోర్టు. అయితే తనను కస్టడీకి ఇవ్వొద్దని, ఇప్పటికే సిబిఐ తనను ప్రశ్నించిందని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ సీబీఐ అడుగుతోందని కవిత తెలిపారు. సీబీఐది వృథా ప్రయాస అని, చెప్పడానికి ఏమీ లేదని, సీబీఐ తప్పుడు మార్గంలో వెళ్తోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కవిత సీబీఐ కస్టడీపై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. అరెస్టు, రిమాండ్ పై వాదనలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత వింటామని జడ్జి తెలిపారు. దీంతో కవితని కోర్టు రూం నుంచి తీసుకెళ్లారు అధికారులు.
సీబీఐ వాదనలు ఎలా సాగాయంటే..
లిక్కర్ పాలసీ కేసులో కుట్రదారుల్లో కవితది కీలక పాత్ర. సౌత్ గ్రూప్‌కు చెందిన ఒక మద్యం వ్యాపారి కేజ్రీవాల్‌ను కలుసుకుని ఢిల్లీలో వ్యాపారం చేసేందుకు మద్దతు కోరారు. కేజ్రీవాల్ తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. విజయ్ నాయర్‌కు కోట్లు చెల్లించినట్లు నిందితుడు (అభిషేక్ బోయిన్‌పల్లి) తనకు తెలియజేసినట్లు అప్రూవర్ దినేష్ అరోరా తన వాంగ్మూలంలో ధ్రువీకరించారు. ఈ కేసులో నిందితుల స్టేట్‌మెంట్‌లు, వాట్సాప్ చాట్‌లు సేకరించాం.
బుచ్చి బాబు, స్టేట్మెంట్ లో కవిత ఇండో స్పిరిట్స్‌లో హోల్‌సేల్ భాగస్వామి. కంపెనీ ఎన్‌ఓసీ పొందడంలో రాఘవ్ మాగుంటకు సహకరించేందుకు కవిత ప్రయత్నించినట్లు కూడా చాట్స్ వెల్లడించాయి. ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో బుచ్చిబాబు, బోయిన్‌పల్లి తదితరులు హాజరైన సమావేశంలో శరత్‌రెడ్డి కూడా ఉన్నారు. పెర్నోడ్ రిచర్డ్ కంపెనీ హోల్‌సేలర్‌గా ఇండో స్పిరిట్స్‌ను నియమించాలని నిర్ణయించారు. 2021 మార్చి, మే నెలల్లో ఎక్సైజ్ పాలసీని రూపొందిస్తున్న సమయంలో అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు, బోయిన్‌పల్లి ఢిల్లీలో మకాం వేసి విజయ్ నాయర్ ద్వారా చక్రం తిప్పారు
ఢిల్లీలో మద్యం వ్యాపారం చేద్దామని శరత్ చంద్రారెడ్డి, మాగుంటకు కవిత హామీ ఇచ్చారు. ఈ కేసులో కవిత కీలక కుట్రదారుల్లో ఒకరని వాంగ్మూలాల ద్వారా రుజువయింది . వివిధ కారణాలను చూపుతూ ఆమె విచారణకు సహకరించలేదు. నవంబర్-డిసెంబర్ 2021 లో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఢిల్లీ లో ప్రతి జోన్ కు ఐదు కోట్ల చొప్పున 25 కోట్లు చెల్లించాలని కవిత శరత్ చంద్రారెడ్డిని కోరింది. శరత్ చంద్రారెడ్డి తొలుత ఈ వ్యాపారంలో అయిష్టత ప్రదర్శించాడు. అయితే తెలంగాణలో ఆయన వ్యాపారాన్ని దెబ్బతీస్తానని కవిత బెదిరించింది. సీబీఐ విచారణలో, తన పాత్రకు సంబంధించి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు.
సీబీఐ స్వాధీనం చేసుకున్న పత్రాలకు విరుద్ధంగా ఆమె సమాధానాలు ఉన్నాయి. తనకు తెలిసిన వాస్తవాలను ఆమె దాచిపెడుతోంది. గతంలో కూడా ఆమె నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. మద్యం పాలసీకి సంబంధించిన పెద్ద కుట్రను వెలికితీసేందుకు కవితను ఆధారాలతో విచారణ చేయాలి. ఈ కేసులో ఆమె ప్రధాన కింగ్‌పిన్, కుట్రదారు. కవితను సీబిఐకి ఐదు రోజుల కస్టడీ అనుమతించాలి. కవిత అరెస్ట్ విషయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరగలేదు. కవిత భర్తకు ముందుగా సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేసాం. కవిత అరెస్ట్ గురించి ముందస్తు సమాచారం ఇచ్చేందుకు, ఆమెనే మాకు రెండు ఫోన్ నంబర్లు ఇచ్చారు.
కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు ఎలా సాగాయంటే..
నా వాదనలు వినిపించేందుకు నాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నోటీసులు ఇవ్వలేదు. నాకు సీబీఐ ముందస్తు కాపీ ఇవ్వలేదు. ఇది నా రాజ్యాంగ హక్కును ప్రభావితం చేస్తుంది. సీబీఐ అరెస్ట్ విషయంలో న్యాయంగా, చట్టంలోని పవిత్రమైన నిబంధనల ఉల్లంఘన జరిగింది. సెక్షన్ 41 సీఆర్‌పీసి ప్రకారం సిబిఐ అరెస్టు చేయడానికి వీలు కల్పిస్తుంది,.
అయితే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు, కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేసే ప్రశ్నే లేదు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదు. కవిత విషయంలో సీబీఐ ఈ నిబంధన ఫాలో కాలేదు. కవిత తరపు న్యాయవాది - రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 (1) ప్రకారం ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించే ముందు, వారి వాదన కూడా వినాలని ఉంది
నిన్న తీహార్ జైల్లో ఉన్న కవిత అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. సీబీఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా సీబిఐ అరెస్ట్ చేసిందని కవిత తరపు న్యాయవాది పేర్కొన్నారు.బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌పై సీబీఐ దృష్టి పెట్టింది. వంద కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేపట్టింది.
సౌత్ గ్రూపునకు ఆప్‌కు మధ్య కవిత దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఐపీసీ 120బి కింద కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేపట్టింది.