Talasani Praises KCR: కేసీఆర్ ను సాక్షాత్తూ కొమురవెల్లి మల్లన్న స్వరూపంగా కొనియాడిన మంత్రి తలసాని.. దీనికి ఆయన చెప్పిన కారణాలు ఏంటంటే?? వీడియోతో
ఆయన్ని కొమురవెల్లి మల్లన్నతో పోల్చారు.
Siddipet, March 6: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (Telangana CM KCR) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన్ని కొమురవెల్లి మల్లన్నతో (Komuravelli Mallanna) పోల్చారు. వివరాల్లోకి వెళ్తే, సిద్ధిపేట జిల్లా (Siddipet) గజ్వేల్ మండలం రిమ్మనగూడలో నిన్న కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని యాదవులు నిర్వహించిన ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి అతిథిగా హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ.. కేసీఆర్ మన మధ్య ఉన్న దేవుడని, సాక్షాత్తూ కొమురవెల్లి మల్లన్న స్వరూపమని అన్నారు.
మల్లన్న ప్రతిరూపంగా ఆయన మన మధ్య ఉండి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వాల హయాంలో యాదవులు ఎంతో వివక్షకు గురయ్యారని, అలాంటి వారికి ఇప్పుడు కేసీఆర్ రూ. 11 వేల కోట్లతో రాయితీ గొర్రెలు అందించారని అన్నారు. యాదవుల ఆరాధ్య దైవం కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి కేసీఆర్ నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.