Beware of fake OTP delivery scam Representational Image (Photo Credit: PTI)

New Delhi, March 05: ఆన్‌లైన్ మోసాల ప‌ట్ల కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ, టెలికం శాఖ‌, వివిధ బ్యాంకులు ఖాతాదారుల‌కు హెచ్చరిక‌లు చేస్తున్నా..సైబ‌ర్ మోస‌గాళ్ల (Cyber Farud) వ‌ల‌లో ప‌డుతున్నారు ప్రజ‌లు. వారిలో సెల‌బ్రిటీలు కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న ముంబైలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో చోటు చేసుకుంది. నో యువ‌ర్ కస్టమ‌ర్ (KYC), పాన్ కార్డు వివ‌రాలు అప్‌డేట్ చేసుకోవాల‌ని కొంద‌రు వ్యక్తుల మొబైల్ ఫోన్లకు ఫేక్ మెసేజ్‌లు వ‌చ్చాయి. ఆ మెసేజ్‌లు క్లిక్ చేసిన వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షల్లో డ‌బ్బు మాయమైంది. ప్రతి బ్యాంకు ఖాతాదారు, ఖాతా ఓపెన్ చేసిన‌ప్పుడు వారి కేవైసీ ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డం త‌ప్పనిస‌రి. ఈ నిబంధ‌న‌ను అడ్డం పెట్టుకుని మోస‌గాళ్లు 40 మందిని బురిడి కొట్టించారు. ఆపై రూ.ల‌క్షల్లో న‌గ‌దు మాయం చేశారు. ఈ నేప‌థ్యంలో బ్యాంకు ఖాతాదారులు (Bank Customers) అటువంటి లింక్‌లు క్లిక్ (Link Click) చేయొద్దని ముంబై పోలీసులు హెచ్చరించారు. కేవైసీ, పాన్ కార్డు వివ‌రాలు అప్‌డేట్ చేసుకోకుంటే బ్యాంక్ ఖాతా బ్లాక్ చేస్తామని పేర్కొంటూ మోస‌గాళ్లు పంపే లింక్‌ల ప‌ట్ల అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. బ్యాంక్ ఫేక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి క‌స్టమ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్, ఇత‌ర కాన్ఫిడెన్షియ‌ల్ డిటైల్స్ న‌మోదు చేయాల‌ని పేర్కొని, అలా చేసిన 40 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి న‌గ‌దు విత్ డ్రా చేసేశారు. అలా మోస‌పోయిన వారిలో టీవీ న‌టి శ్వేత మెమ‌న్ (Shweta Memon) కూడా ఉన్నారు.

Toll Tax Hike: నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్నారా? అయితే మీకు టోల్ బాదుడు తప్పదు, టోల్ ఫీజులను పెంచేందుకు నిర్ణయించిన కేంద్రం, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త చార్జీలు 

గ‌త గురువారం త‌న ఫోన్‌కు వ‌చ్చిన లింక్‌, బ్యాంకుదేమోన‌ని భావించి క్లిక్ చేసిన‌ట్లు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో శ్వేత మెమ‌న్ తెలిపారు. పోర్టల్ ఓపెన్ కాగానే, వారి క‌స్టమ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్స్‌, ఓటీపీ న‌మోదు చేశారు. అటుపై బ్యాంకు అధికారినంటూ ఓ మ‌హిళ ఫోన్ కాల్ చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫోన్‌లో మాట్లాడిన మ‌హిళ చెప్పిన‌ట్లు మ‌రో ఓటీపీ నంబ‌ర్ న‌మోదు చేశాన‌ని, అటుపై త‌న బ్యాంకు ఖాతా నుంచి రూ.57,636 డెబిట్ అయిన‌ట్లు మెసేజ్ వ‌చ్చింద‌ని వాపోయారు.