Medico Preethi Last Rites: ముగిసిన మెడికో ప్రీతి అంత్యక్రియలు, కడసారి వీడ్కోలు పలికేసిందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, నేతలు, నిందితుడిని ఉరితీయాలని ప్రీతి తండ్రి నరేందర్ డిమాండ్

మెడికో ప్రీతి (Medico Preeti) అంత్యక్రియలు (Preeti last rites) స్వగ్రామం గిర్నితండాలో ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Dr Preethi Funeral (Photo Credit- Video Grab)

Girni Thanda, Feb 27: మెడికో ప్రీతి (Medico Preeti) అంత్యక్రియలు (Preeti last rites) స్వగ్రామం గిర్నితండాలో ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అటు, వివిధ పార్టీల నాయకులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రీతి అంత్యక్రియల సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga), బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ నేతలు (BJP Leaders) పాడె పట్టారు. ప్రీతి అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి మృతి, ఆమెకు సైఫ్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాడంటూ కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణ

ఆమె ఏం తీసుకుందో ఇప్పటి వరకు నిర్థారణ కాలేదు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేపట్టాలి. మరొకరు ప్రీతిలా మారకుండా ఉండాలంటే వేధింపులకు పాల్పడిన సైఫ్ పై ఉరితీయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడిను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తండ్రి నరేందర్‌ తెలిపారు. ప్రీతి మృతి చెందడానికి సైఫ్ ఒక్కడే కాదు ఇంకా కొందరి ప్రేమయం ఉందని ఆమె సోదరి ఆరోపించింది. తనకు తానుగా మత్తు ఇంజక్షన్‌ తీసుకోలేదు.. కొందరు పట్టుకుంటే, సైఫ్ ఇంజక్షన్ చేశాడు. నలుగుర్ని ఎదురించే బలం కూడా ప్రీతికి లేదు. అంటూ ప్రీతి సోదరి పేర్కొన్నారు.

వైద్య విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం కేసులో పురోగతి, నిందితుడికి 14 రోజులు రిమాండ్‌ విధించిన కోర్టు

వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ) (Warangal Kakatiya Medical Collage)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ధారావత్‌ ప్రీతి కథ విషాదంగా ముగిసింది. ఐదు రోజులుగా హైదరాబాద్‌ (Hyderabad)లోని నిమ్స్‌ ఆస్పత్రి (Nims Hospital)లో మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాన విడిచారు. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎంజీఎం అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న ప్రీతి తన సీనియర్‌ ఎంఏ సైఫ్‌ వేధింపులు భరించలేక ఈనెల 22న ఉదయం మత్తు ఇంజక్షన్‌ తీసుకుంది.

అత్యవసర ఆపరేషన్‌ థియేటర్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెకు ఎంజీఎంలోనే చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు నిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆమె గుండె పనితీరు మందగించడంతో ఎంజీఎంలో సీపీఆర్‌ నిర్వహించారు. హైదరాబాద్‌కు తరలించిన తర్వాత రెండుసార్లు నిమ్స్‌ వైద్యులు కూడా సీపీఆర్‌ చేశారు. నిమ్స్‌లో చేరినప్పటి నుంచీ ప్రీతి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు ఏ మాత్రం స్పందించలేకపోయాయి. ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ వచ్చింది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ వైద్యులు యత్నించినప్పటికీ నిన్న రాత్రి ప్రీతి తుదిశ్వాస విడిచారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now