Medico Preethi (PIC @ Twitter)

Hyderabad, FEB 26: వరంగల్‌ (Warangal) ఎంజీఎం (MGM)లో సీనియర్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ పీజీ విద్యార్థిని ప్రీతి మరణించింది. నిమ్స్‌ (NIMS)లో చికిత్స పొందిన ఆమె పరిస్థితి రోజు రోజుకూ దిగజారింది. దాంతో రాత్రి 9.10 నిమిషాలకు ఆమె మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.  ఇన్ని రోజులుగా చికిత్స చేసినప్పటికీ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుపడ లేదని, వెంటిలేటర్‌పై చికిత్స అందించామని నిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో విద్యార్థినికి చికిత్స అందించినట్లు వివరించారు. అయితే ఇవాళ మధ్యాహ్నం ప్రీతి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లుగా వైద్యులు తెలిపినట్లు కుటుంబీకులు తెలిపారు. దాంతో నిమ్స్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Honour Killing In Nandyala: కుమార్తె అత్తింటికి వెళ్ళట్లేదని కన్నతండ్రి ఘాతుకం.. బిడ్డను హత్య చేసి తల, మొండెం వేర్వేరు.. నంద్యాలలో ‘పరువు’ హత్య 

ఈ సందర్భంగా విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, ఇందుకు కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రీతిది (Preethi) ఆత్మహత్యా యత్నం కాదని.. ఇది ముమ్మూటికి హత్యేనన్నారు. సైఫే తమ కూతురిని హత్య చేశాడన్నారు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్‌ను నియంత్రించలేకపోయారని, సమస్యను హెచ్‌ఓడీ సరిగా హ్యాండిల్‌ చేయలేదని ఆరోపించారు. ఆ రోజు ఉదయం 4.30 గంటలకు ఘటన జరిగితే 8 గంటల వరకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రీతి మొబైల్‌లో వారికి కావాల్సినట్లు సాక్ష్యాలు క్రియేట్‌ చేసుకున్నారన్నారు.

Peddapalli Shocker: అయిదేళ్లుగా కడుపులోనే కత్తెర.. పెద్దపల్లిలో వైద్యుల నిర్వాకం 

మరో వైపు వైపు ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. తన ఆవేదనను తల్లితో పంచుకున్నది. సైఫ్ తనతో సహా చాలా మంది జూనియర్లను వేధిస్తున్నారని తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. సీనియర్లు అంతా ఒకటిగా ఉన్నారని బాధపడింది. పోలీసులతో సైఫ్‌కు నాన్న ఫోన్ చేయించినా లాభం లేదని తల్లితో చెప్పుకుంటూ కుమిలిపోయింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటై తనను దూరం పెడతారని, ఏదైనా సమస్య ఉంటే తన దగ్గరికి రావాలని హెచ్‌ఓడీ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పింది. ఈ మాటలు విన్న తల్లి సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని కూతురికి ధైర్యం చెప్పింది.

అంతకుముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.