Hyd, Feb 24: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడిన పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్‌లో పేర్కొన్నారు.
మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది.సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఫోన్ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఎంజీఎంలో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై సీపీ మీడియాకు వివరాలను వెల్లడించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు.పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతిని లక్ష్యంగా చేసుకుని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించాడని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. అందరి ముందూ విద్యార్థినిని అతడు అవమానించాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.
ప్రీతి చాలా తెలివైన, ధైర్యం ఉన్న అమ్మాయి. అలాగే ఆమెది సున్నిత మనస్తత్వం. కేస్ షీట్ విషయంలో ప్రీతిని అవమానించేలా సైఫ్ మాట్లాడాడు. దీనిపై ఈనెల 18న వాట్సాప్ గ్రూపులో అతడు పెట్టిన మెసేజ్‌పై ప్రీతి పర్సనల్‌గా ప్రశ్నించింది. తనను ఉద్దేశించి గ్రూప్‌లో వ్యక్తిగతంగా చాట్ చేయడం సరికాదని.. ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పింది.
సైఫ్ ఆధిపత్యం చేసేందుకు యత్నించాడు. అతడు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడని స్నేహితులతో చేసిన చాటింగ్‌లో ప్రీతి పేర్కొంది. బ్రెయిన్ లేదంటూ సైఫ్ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.ఒక వ్యక్తి ఇన్‌సల్ట్‌గా ఫీలయితే అది ర్యాగింగ్ కిందికే వస్తుంది. ప్రీతినే లక్ష్యంగా చేసుకుని అవహేళన చేసినట్లు చాటింగ్ ద్వారా వెల్లడైంది. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్ చేశాం. మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బందిగా భావించింది. గత ఏడాది డిసెంబర్ 6న రెండుమూడు సార్లు చిన్న ఘటనలు జరిగాయి.
సీనియర్లను జూనియర్లు సార్ అని పిలవాలనే కల్చర్ అక్కడుంది. బాసిజం తరహాలో ఉందని ప్రీతి భావించింది. ప్రశ్నించేతత్వమే సైఫ్‌కు మింగుడుపడినట్లు లేదు. కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల దీని వల్ల విచారణపై ప్రభావం పడుతుంది’’ అని సీపీ రంగనాథ్ అన్నారు.నిందితుడు సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. సైఫ్ (Saif)కు 14 రోజుల రిమాండ్ (Remand) విధించింది కోర్టు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితుడిని ఖమ్మం జైలుకు తరలించారు.
వరంగల్ ఎంజీఎం(Warangal MGM)లో ఆత్మహత్యకు యత్నించిన పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతికి నిమ్స్(NIMS)లో మెరుగైన వైద్యం అందుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) తెలిపారు. ఎక్మోపైనే ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. నిమ్స్‌కు వచ్చి వైద్యులతో మాట్లాడిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఇలాంటి ఘటనలు దురదృష్టకరం. ప్రీతికి మెరుగైన వైద్యం అందుతోంది. గత రెండు రోజుల కంటే పరిస్థితి మెరుగుపడింది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదు. వారిని త్వరలోనే శిక్షిస్తాం. ప్రీతి ఆరోగ్యంపై గంట గంటకూ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షిస్తున్నారు. వైద్యంతో పాటు భగవంతుడి ఆశీస్సులతో ఆమె కోలుకోవాలి. కోలుకున్నాక ప్రీతి స్టేట్‌మెంట్‌ను పోలీసులు తీసుకుంటారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మెరుగ్గా ఉంది’’ అని మంత్రి చెప్పారు.