MGM in Warangal (Photo-Video Grab)

Hyd, Feb 22: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో అనస్తీషియా విభాగంలోని పీజీ వైద్యురాలు ఈ రోజు తెల్లవారుజామున విధుల్లో ఉండగా హానికరమైన ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి(Junior Doctor Attempts Suicide) పాల్పడిన సంగతి విదితమే. ప్రస్తుతం హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతోంది.వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌ నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఐదు గంటలు గడిస్తే కాని ఆమె పరిస్థితి చెప్పలేమని (now Critical Condition ) వైద్యులు చెబుతున్నారు. మత్తు ఇంజక్షన్‌ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వైద్యులు చెబుతున్నారు.

తన బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని ఆమె తండ్రి నరేంద్ర తెలిపారు. ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కాలేజీ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్‌ నుంచి ఆమెను సీనియర్‌ విద్యార్థి వేధిస్తున్నాడు. ఇదే అంశంపై కేఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తన కుమార్తె తెల్ల వారుజామున ఆత్మహత్యాయత్నానికి ( PG doctor attempts commit suicide) పాల్పడితే ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం మాకు కనీసం ఫోన్‌ కూడా చేయలేదు.

ర్యాగింగ్ భూతమేనా, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని, పరిస్థితి విషమం

ర్యాగింగ్‌ను మా అమ్మాయి వ్యతిరేకించింది. తనకు మద్దతు పలకాలని తోటి విద్యార్థులను కోరింది. రెండు సంవత్సరాలు ఇక్కడే పనిచేయాలి కాబట్టి తమను కూడా వేధిస్తారని తోటివిద్యార్థులు వెనకడుగు వేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో 5 గంటలు గడిస్తే కాని స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ర్యాంగింగ్‌కు పాల్పడిన విద్యార్థిపై, కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అర్థరాత్రి ఆ పని కోసం ప్రియురాలి గదికి, బాత్ రూంలో దాక్కుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కానిస్టేబులైన భర్త, వరంగల్ జిల్లాలో షాకింగ్ ఘటన

ప్రీతి నవంబర్‌లో పీజీ కాలేజీలో జాయిన్‌ అయ్యింది. డిసెంబర్‌ నుంచి సైఫ్‌ అనే సీనియర్‌ విద్యార్థి ర్యాగింగ్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. ప్రీతి ఈ విషయం మాకు చెబితే ధైర్యం చెప్పాము. స్థానికంగా అధికారులు, పోలీసులకు సమాచారం కూడా ఇచ్చాము. ఈ విషయం యూనివర్సిటీ అధికారులకు తెలియడంతో పోలీసు కంప్లెంట్‌ ఎందుకు ఇచ్చారని వారు మందలించారు.

అయితే, ఈ రోజు ఉదయం ప్రీతి ఫోన్‌ నుంచి తన ఫ్రెండ్‌ కాల్‌ చేసి.. ప్రీతి కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పారు. వెంటనే మేమంతా ఆసుపత్రికి వెళ్లాము. అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్‌, అధికారులందరూ అక్కడికి వచ్చారు. ప్రీతి కరోనా సమయంలో కూడా ప్రాణాలు లెక్కచేయకుండా ధైర్యంగా సేవ చేసింది. చదువుల్లో మెరిట్‌ స్టూడెంట్‌. ఇలా ఆత్మహత్యాయత్నం చేసిందంటే మాకు చెప్పని విధంగా ఇంకా ఎన్ని రకాలుగా హింసించాడో తెలియడం లేదు. వెంటనే సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్‌ చేశారు.

పీజీ వైద్యురాలి తండ్రి నరేంద్ర ఆర్పీఎఫ్‌ వరంగల్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం హైదరాబాద్‌ లో నివాసముంటోంది. విద్యార్థిని 3 నెలల క్రితం కేఎంసీలో అనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరంలో చేరారు. నిన్న రాత్రి చివరి సారిగా ఆమె తన సోదరుడితో మాట్లాడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ వైద్య విద్యార్థిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వేధింపుల కేసు నమోదైంది. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.