Telangana Election Results 2023: మళ్లీ ఎంపీగా పోటీ చేస్తా, బర్రెలక్క సంచలన నిర్ణయం, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు విజయం
అత్యధిక సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతుంది. అయితే కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.
Assembly Election 2023 Results Live News Updates: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన యూట్యూబర్ కర్నె శిరీష (బర్రెలక్క) నాలుగో స్థానంలో నిలిచారు. ఆమెకు మొత్తం 5,754 ఓట్లు పోలయ్యాయి. నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో తన గళం వినిపిస్తానంటూ ఆమె ఎన్నికల బరిలో నిలిచారు.
కానీ జనం ఆమెను ఆదరించలేదు. కాగా, కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. ఆయనకు మొత్తం 93,609 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డికి 63,678 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, బీజేపీ అభ్యర్థి అల్లేని సుధాకర్‌రావు 20,389 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కన్నా బర్రెలక్కకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో 473 ఓట్లు రాగా రెండో రౌండ్‌లో 262 ఓట్లు పోలైయ్యాయి.
తన ఓటమిపై మీడియాతో మాట్లాడిన శిరీష ఈ ఓటమి తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదని చెప్పింది. ఈ ఎన్నికల్లో నాకు మద్ధతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. నేను అనుకున్నదానికంటే ఎక్కువే ఓట్లు వచ్చాయి. అందుకు నేను సంతోషంగా ఉన్నాను. మొదటి ప్రయత్నంలోనే ఇంతటి ఆదరణ నాకేంతో ధైర్యాన్నిచ్చింది. ఈ ఓటమి నన్ను పెద్దగా బాధించట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ నిరుద్యోగులంతా నావైపే ఉన్నారు. ఇందులో ఓడిపోయినంత మాత్రానా వెనకబడుగు వేయాలనుకోవట్లేదు. త్వరలోనే ఎంపీగా పోటీ చేస్తా.
ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్, విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అంటూ..
రాజకీయ అనుభవం లేకపోయినా తెలుసుకుంటూ ముందుకెళతా. ఇది నా తొలి అడుగే. అయినా ప్రజలు నాకు ఎంతో స్ఫూ్ర్తి కలిగించారు. నాపై దాడులు జరిగినా వెనకడుగు వేయకుండా మరింత శక్తితో అడుగులు వేస్తున్నా. ఇందులో గెలిస్తే నా దగ్గర పైసలు లేకపోయినా గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ తో అభివృద్ధి చేయాలని అనుకున్నా. నిరుద్యోగుల సమస్యలు, రోడ్లు, తదితర అంశాలపై నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని తెలిపింది.
అలాగే సోషల్ మీడియా ద్వారా తనకు దేశ వ్యాప్తంగా లభించిన సపోర్టు ఎంతో ధైర్యాన్నించ్చిందని తెలిపింది. అయితే కొంతమంది తాను సోషల్ మీడియా హైప్ కోసం ఇలాంటి పనులు చేశానని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తనకు ఏమీ లేదు ప్రజలకు ఏమీ చేస్తుందని ఎగతాళి చేశారు. అయినా బాధపడలేదు. ఎందుకంటే ఒక్కరూపాయి ఇవ్వకుండా ఓట్లు వేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. చివరగా పుట్టగానే ఎవరూ నడవరని, భవిష్యత్తులోనూ తాను తప్పకుండా విజయం సాధిస్తానని తెలిపింది.
ఇక ఇదిలావుంటే.. కొత్త గవర్నమెంట్ కూడా మంచి పనులు చేయాలి. నిరుద్యోగం, సమస్యలు పరిష్కారం దిశగా ఉండాలని కోరుతున్నాను. జేడీ లక్ష్మీనారాయణ, కంచె ఐలయ్య వంటి ప్రముఖులతోపాటు పౌర హక్కులు, మహిళా సంఘాల వాళ్లుకూడా సపోర్టుగా నిలిచినందుకు థాంక్స్ చెప్పింది.