తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు 29 స్థానాల్లో విజయం సాధించిన హస్తం మరో 35 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల్లో గెలుపొందగా 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

తాజాగా మంత్రి కేటీఆర్ ఫలితాలపై ట్వీట్ చేశారు. వరుసగా రెండు పర్యాయాలు గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందాను. కానీ మేము దీన్ని ఒక అభ్యాసంగా తీసుకుంటాము. తిరిగి పుంజుకుంటాము. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)