Telangana Horror: తెలంగాణలో భగ్గుమన్న భూతగాదాలు, గొడ్డళ్లు కత్తులతో దాడి చేసి ముగ్గురి హత్య చేసిన ప్రత్యర్థులు, మరో ముగ్గురి పరిస్థితి విషమం

భూతగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యర్థులు గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగడంతో.. మహిళ సహా ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Murder (Photo Credits: Pixabay)

Kumuram Bheem Asifabad, June 26: కుమురంభీం జిల్లా రెబ్బన మండలం జక్కుపల్లిలో భూకక్షలు భగ్గుమన్నాయి. భూతగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యర్థులు గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగడంతో.. మహిళ సహా ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం 15 మంది దాడికి పాల్పడినట్లు సమాచారం.

భూతగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. దాంతో ఓ వర్గంపై ప్రత్యర్థి వర్గం దాడికి గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ సైతం ఉన్నది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

విజయవాడలొ దారుణం, భార్యను కాపురానికి పంపలేదని నడిరోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు, తృటిలో తప్పించుకున్న మామ

మృతులను మండల లింగయ్య, మండల నరసయ్య, గిరుగుల బక్కమ్మగా గుర్తించినట్లు తెలుస్తున్నది. ఘటనలో మండల సంతోష్‌, మండల దుర్గయ్య గాయపడ్డట్లుగా తెలుస్తున్నది. మధ్యాహ్నం సమయంలో జక్కులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న భూమిలో ఈ ఘర్షణ జరిగిందని, ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్లు సమాచారం. దాడిలో దాదాపు 15 మంది కలిసి ఓ వర్గంపై దాడికి పాల్పడ్డట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.