Australia Parrot: రూ.1.30 లక్షల విలువైన ఆస్ట్రేలియా చిలుక కనిపించడం లేదని జూబ్లీహిల్స్ వ్యాపారి ఫిర్యాదు.. ఒక్క రోజులో వెతికితెచ్చిన పోలీసులు.. ఎలా కనిపెట్టారంటే??

ఆస్ట్రేలియాకు చెందిన రాక్టో అనే 4 నెలల వయసున్న తన చిలుక ఎక్కడికో ఎగిరిపోయిందని, ఆ చిలుకను రూ.1.30 లక్షలు పెట్టి కొనుగోలు చేశానని ఫిర్యాదు చేసిన వ్యక్తికి అతడి చిలుకను ఒక్క రోజులో జూబ్లీహిల్స్ పోలీసులు పట్టితెచ్చి ఇచ్చారు.

Australia Parrot (Credits: X)

Hyderabad, Oct 3: ఆస్ట్రేలియాకు (Australia) చెందిన రాక్టో అనే 4 నెలల వయసున్న తన చిలుక (Parrot) ఎక్కడికో ఎగిరిపోయిందని, ఆ చిలుకను రూ.1.30 లక్షలు పెట్టి కొనుగోలు చేశానని ఫిర్యాదు చేసిన వ్యక్తికి అతడి చిలుకను ఒక్క రోజులో జూబ్లీహిల్స్ పోలీసులు (Police) పట్టితెచ్చి ఇచ్చారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, నరేంద్రాచారి మైరు అనే వ్యాపారి రోడ్ నెం. 44లో నివసిస్తుంటారు. ఆయన బిస్ట్రో కాఫీ షాపు నిర్వహిస్తుంటారు. ఇటీవల ఆయన ఆస్ట్రేలియాకు చెందిన రాక్టో అనే 4 నెలల వయసున్న చిలుకను రూ.1.30 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. కానీ సెప్టెంబర్ 22న చిలుకకు ఆహారం పెట్టేందుకు బోను తలుపు తీయగా అది హఠాత్తుగా ఎగిరిపోయింది. సెప్టెంబర్ 24న నరేంద్రాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలుక ఫొటో కూడా వారికి ఇచ్చారు.

Maharashtra: మహారాష్ట్రలో ఘోరం, ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లో 12మంది శిశువులతో సహా 24 మంది మృతి, అధికార పార్టీపై విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు

కనిపెట్టేశారు ఇలా..

రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫొటోను స్థానిక పక్షులు, జంతువుల విక్రయదారులకు పంపించారు. అయితే, అప్పటికే ఈ చిలుక రెండు సార్లు చేతులు మారింది. మూడోమారు ముజీబ్ అనే వ్యక్తి రూ.70 వేలకు చిలుకను అమ్మకానికి పెట్టాడు. చిలుక ఫొటోను వాట్సాప్ స్టేటస్‌‌లో పెట్టాడు. జూబ్లీహిల్స్‌ లోని ఓ పెట్ షాపు యజమాని ఈ విషయాన్ని  ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం తెలియజేయడంతో వారు చిలుకను స్వాధీనం చేసుకున్నారు.

కేంద్రం భారీ షాక్‌.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు.. 19 కిలోల సిలిండర్‌ ధరపై రూ.209 పెంపు



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif