Hyderabad Horror: వెంటపడిన కుక్క.. భయపడి పరిగెత్తుతూ హోటల్ భవనం నుంచి కిందపడి యువకుడి మృత్యువాత.. హైదరాబాద్ లో దారుణం
ఓ కుక్క నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తెనాలికి చెందిన ఉదయ్ (23) అనే యువకుడు ఆర్‌సీ పురంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.
Hyderabad, Oct 22: హైదరాబాద్ (Hyderabad) లోని చందానగర్ లో ఘోరం జరిగింది. ఓ కుక్క నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తెనాలికి చెందిన ఉదయ్ (23) అనే యువకుడు ఆర్‌సీ పురంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం మిత్రులతో కలిసి అతడు చందానగర్ లోని వీవీప్రైడ్ అనే హోటల్ కు వెళ్లాడు. ఈ క్రమంలో హోటల్ మూడో అంతస్తుకు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క (Dog) ఉదయ్ వెంటపడింది. దాంతో దాని నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ కిటికీ దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆ కిటికీలోంచి అతడు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం బయటకు పొక్కనీయకుండా..
ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హోటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే, ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినా విషయాన్ని బయటకు పొక్కనీయకుండా హోటల్ సిబ్బంది జాగ్రత్తపడ్డారు. అయితే, ఉదయ్ మిత్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్ విడుదల