Police Arrested The Bull: ఎద్దును అరెస్ట్ చేసిన పోలీసులు, చేనులో మేసింద‌ని 3 రోజులు స్టేష‌న్ లోనే నిర్భందం, మంచిర్యాల జిల్లాలో వింత ఘ‌ట‌న‌

పోలీసులు ఓ ఎద్దును అరెస్ట్ చేసి (Bull Arrest) పోలీస్ స్టేషన్ ముందు కట్టేశారు. ఆ ఎద్దు యజమాని వస్తే కథేంటో తేల్చుదాం అన్నట్లుగా ఎద్దును తీసుకెళ్లి స్టేషన్ లో కట్టేశారు.

Representational Image (File Photo)

Manchirayal, DEC 14: తప్పు చేసినా..నేరం చేశారనే ఫిర్యాదు అందినా పోలీసులు మనుషుల్ని అరెస్ట్ చేస్తుంటారు. కానీ..మేకల్ని, ఎద్దుల్ని, గేదెల్ని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని వింత వింత ఘటనల్లో ఇటువంటివి జరుగుతుంటాయి. తాజాగా అటువంటిదే జరిగింది తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో. పోలీసులు ఓ ఎద్దును అరెస్ట్ చేసి (Bull Arrest) పోలీస్ స్టేషన్ ముందు కట్టేశారు. ఆ ఎద్దు యజమాని వస్తే కథేంటో తేల్చుదాం అన్నట్లుగా ఎద్దును తీసుకెళ్లి స్టేషన్ లో కట్టేశారు. ఇంతకీ ఈ వింత కథాకమామీషు వెనుకాల ఉన్న అసలు సంగతేంటో తెలిస్తే..ఆ ఎద్దు చేసిన తప్పేంటీ..అసలు తప్పు చేసింది ఆ ఎద్దా..? లేదా.. ఆ ఎద్దు యజమానిదా అని డౌట్ వస్తుంది..

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు, ప్రతి నెలా జీతాలతో పాటు అలవెన్సులు కలిపి చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు 

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో (Chennur police) నివసించే మల్లన్న అనే రైతుకు కొన్ని ఆవులు..ఎద్దులు, గేదెలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రైతు తన ఎద్దును మేతకని విడిచిపెట్టాడు. దీంతో ఆ ఎద్దు పక్కఊరి పొలంలో దిగి మేత మేస్తుండగా ఆ పొలం యజమాని చూసాడు. ఆ పొలం సర్ధార్ అనే రైతుది. దీంతో ఆ రైతుకు కోపం ఇంతెత్తున వచ్చింది. అంతేమరి కష్టపడి సాగు చేసుకునే పొలం పాడైతే ఎవరికైనా బాధేస్తుంది. కోపమొస్తుంది. కానీ పాపం ఆ నోరు లేని మూగ జీవానికి తెలియదు కదా..అది తన యజమాని పొలమా..? లేదా ఇతరులుదా అని..చక్కగా పచ్చగా పొలం కనిపించేసరికి దిగి చక్కగా ఆరగించింది.

No Water Supply to Hyderabad: హైదరాబాద్ లో రేపు నల్లా నీళ్లు బంద్‌.. ప్రభావం పడే ప్రాంతాల జాబితా ఇదిగో! 

దీంతో ఆ పొలం గల యజమానికి కోపమొచ్చింది. ఎద్దును తీసుకెళ్లి తన ఇంటివద్ద కట్టేశాడు. సాయంత్రం అయినా తన ఎద్దు ఇంటికి రాకపోయేసరికి యజమాని దానిని వెతుక్కుంటు రాగా ఓ ఇంటిముందున్న తన ఎద్దు కట్టేసి కనిపించింది. వెంటనే ఆ వ్యక్తిని ఆ ఎద్దు నాది నీ ఇంటివద్ద ఎందుకు కట్టేసావు..? అని అడిగాడు. దీంతో సర్ధార్ మల్లన్నమీదకు గొడవకు దిగాడు. నీ ఎద్దు నా పొలం అంతా పాడు చేసింది అందుకే తీసుకొచ్చి కట్టేశాను అని చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో మల్లన్న చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఎద్దును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కట్టేశారు. దీంతో ఎద్దు పంచాయతీ కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. అలా రెండు మూడు రోజులు జరిగింది. గొడవ సర్దుబాటు కాలేదు.దీంతో పాపం బసవన్నకు నీళ్లు మేత లేక అల్లాడిపోయింది. దీంతో పోలీసులు ఎద్దును తోలుకెళ్లిపొమ్మని యజమాని మల్లన్నకు అప్పగించేశారు. కానీ గొడవమాత్రం కొనసాగుతోంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif