Hyderabad, Dec 12: హైదరాబాద్ (Hyderabad) మహానగరానికి తాగునీటి సరఫరా (Drinking Water Supply) చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి పథకం ఫేజ్-3లోని కోదండపూర్ పంపింగ్ స్టేషన్ వద్దనున్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ హైడర్ పైపులైన్ కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ నెల 13 (బుధవారం) ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు గురువారం ఉదయం 5 గంటల వరకు ఈ మరమ్మతు పనులు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ 24 గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
Greenery Affects on Age: పచ్చదనంతో నవ యవ్వనం.. నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల వెల్లడి
ప్రభావిత ప్రాంతాలివే!
బండ్లగూడ, భోజగుట్ట, షేక్‌పేట్, ఆళ్లబండ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, తట్టిఖానా, లాలాపేట్ పాక్షిక ప్రాంతా లు, సాహేబ్ నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవి రిజర్వాయర్, సైనిక్‌పురి, మౌలాలి, స్నేహపురి కాలనీ, కైలాసగిరి, దేవేంద్రనగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సోసైటీ, కావురి హిల్స్, మధుబన్, దుర్గానగర్ , బుద్వేల్, సులేమా నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్‌పూర్, గంధంగూడ, బోడుప్పల్, మల్లికార్జున నగర్, మాణిక్ చంద్, చెంగిచర్ల, భరత్‌నగర్, పీర్జాదిగూడ, శాస్త్రిపురం.